Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు ఎవరికీ మాట ఇవ్వకండి.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 15, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వృషభ రాశి వారికి ఇష్టమైన బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. మిథున రాశి వారిని అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు ఎవరికీ మాట ఇవ్వకండి.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
Horoscope Today 15th June 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 15, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జూన్ 15, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వృషభ రాశి వారికి ఇష్టమైన బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. మిథున రాశి వారిని అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగంలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులన్ని టినీ సకాలంలో, నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో బంధుమిత్రుల సహాయ సహాకారాలు లభిస్తాయి. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇష్టమైన బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఆదాయం బాగానే పెరుగుతుంది. ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు మరింతగా వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థికంగా అనుకూలతలు కలుగుతాయి. బంధువుల వల్ల డబ్బు నష్టపోయే అవ కాశముంది. సొంత పనుల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

మాట తీరు, పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. రావలసిన డబ్బును వసూలు చేసుకుంటారు. రుణ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్త వుతాయి. అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. వ్యక్తిగత సమస్యలకు అనుకోకుండా పరిష్కారం కనిపిస్తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

నిరుద్యోగులకు వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. కొందరు ప్రముఖుల సహాయంతో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. అనుకోకుండా కొందరు చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుం టారు. బంధువుల ఆరోగ్యానికి సంబంధించి దుర్వార్త వినే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

చేపట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. కొందరు బంధుమిత్రులతో సఖ్యత పెరుగు తుంది. వాహన యోగం పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సోదరులతో ఒకటి రెండు సమస్యలు, వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు సమయం బాగుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కుటుంబ వ్యవహారాల్లో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్థిక సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఖర్చుల్ని అదుపు చేయడం మీద దృష్టి పెడతారు. వ్యాపారాల్లో విభేదాలు తగ్గుతాయి. వృత్తి జీవితం ఆశించిన విధంగా సాగిపోతుంది. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ మాట ఇవ్వకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఇంటా బయటా పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి. సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం సాదాసీదాగా సాగిపోతుంది. అనుకోకుండా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, ఆశ్లేష)

వ్యయ ప్రయాసలతో కానీ ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి కాకపోవచ్చు. అనారోగ్య సమస్యలతో కొద్దిగా ఇబ్బంది పడతారు. చేతిలో అవసరానికి సరిపడ డబ్బు ఉంటుంది. నిరుద్యోగులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయడం మంచిది. కొందరు బంధువులతో ఊహించని మాట పట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యో గంలో ఒత్తిడి, శ్రమ ఎక్కువగా ఉంటాయి. కుటుంబ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. గృహ, వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ధనపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. చేపట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. ఇంట్లో శుభ కార్యం జరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా మీ మాటకు విలువ ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. చిన్న నాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండకపోవచ్చు. ఎవరికీ ఎటు వంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది. ఆదాయానికి లోటుండదు. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇతరుల వివాదాలకు, వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. కొద్దిగా సమస్యల ఒత్తిడి ఉంటుంది. ప్రవర్తన, పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగిపో తాయి. వృత్తి జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి ఆర్థిక సమస్యలుండ వచ్చు. కుటుంబసమేతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సొంత ప్రాంతం లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

పనులు, వ్యవహారాల్లో శ్రమ బాగా పెరుగుతుంది. ఆర్థికంగా వాగ్దానాలు చేసి ఇరకాటంలో పడతారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ప్రస్తుతానికి ప్రయాణాల్ని వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో మనస్పర్థలు కలుగు తాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు.

అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్