మిథున రాశిలో బుధుడు సంచారం.. రెండు వారాల పాటు ఆ రాశుల వారికి లక్ష్మీయోగం

ఈ నెల 15 నుంచి 29 వరకు బుధుడు తన స్వస్థానమైన మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ప్రస్తుతం ఇదే రాశిలో సంచారం చేస్తున్న రవితో ఈ బుధుడు యుతి చెందడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశులకు ధనాభివృద్ధికి, పేరు ప్రఖ్యాతులు పెరగడానికి, కొత్త జీవితం ఏర్పడడానికి అవకాశం ఉంది.

మిథున రాశిలో బుధుడు సంచారం.. రెండు వారాల పాటు ఆ రాశుల వారికి లక్ష్మీయోగం
Budhaditya Yoga
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 14, 2024 | 5:18 PM

ఈ నెల 15 నుంచి 29 వరకు బుధుడు తన స్వస్థానమైన మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ప్రస్తుతం ఇదే రాశిలో సంచారం చేస్తున్న రవితో ఈ బుధుడు యుతి చెందడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశులకు ధనాభివృద్ధికి, పేరు ప్రఖ్యాతులు పెరగడానికి, కొత్త జీవితం ఏర్పడడానికి అవకాశం ఉంది. వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశులు ఈ యోగం వల్ల బాగా ప్రయోజనం పొందబోతున్నాయి. శుభ పరిణామాలు చోటు చేసుకోవడం, జీవితంలో మార్పులు రావడం జరుగుతుంది.

  1. వృషభం: ఈ రాశికి ధన స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారు అత్యధికంగా లక్ష్మీ కటాక్షం పొందడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఏ ప్రయత్నం తలపెట్టినా అత్యధికంగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో జీతభత్యాలతో పాటు ఊహించని విధంగా అదనపు రాబడి పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రయత్నపూర్వక లాభా లతో పాటు, అప్రయత్న లాభాలు కూడా అందే అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది.
  2. మిథునం: ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ధన ప్రవాహానికి అవకాశం ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా ఆదాయం పెరుగుతుంది. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కలలో కూడా ఊహించని పురోగతి, జీతభత్యాల పెరుగుదల ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా ఊపందుకుంటాయి. ప్రయాణాల వల్ల, మంచి పరిచయాల వల్ల కూడా ఆర్థిక లాభానికి అవకాశముంటుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది.
  3. సింహం: ఈ రాశికి లాభ స్థానంలో బుధాదిత్య యోగం చోటు చేసుకుంటున్నందువల్ల వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు అంచనాలకు మించి లాభాలు గడించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి సూచన లున్నాయి. జీతభత్యాలు పెరగడంతో అదనపు ఆదాయ మార్గాలు కూడా విస్తరించడం జరుగు తుంది. ఏ ఆదాయ ప్రయత్నానికైనా ఆరోగ్యం అనుకూలిస్తుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిపాస్తుల విలువ ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది.
  4. కన్య: ఈ రాశికి దశమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. భారీ జీతభత్యాలతో పదోన్నతికి అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు అంచనాలకు మించిన వేతనాలతో ఉద్యోగం లభిస్తుంది. కుటుంబపరంగా శుభకార్యాలు జరుగుతాయి. ప్రము ఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా, ఆర్థికంగా ఆశించిన స్థిరత్వం లభిస్తుంది.
  5. తుల: ఈ రాశివారికి భాగ్య స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడినందువల్ల అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా సంపద బాగా వృద్ధి చెందుతుంది. పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యా దలు పెరుగుతాయి. విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని భాగ్య యోగం పడుతుంది. వారసత్వ సంపద లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సాను కూలంగా పరిష్కారం అవుతాయి. శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  6. కుంభం: ఈ రాశికి పంచమ కోణంలో బుధాదిత్య యోగం చోటు చేసుకుంటున్నందువల్ల ఆర్థిక ప్రయత్నా లన్నీ కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు, శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. తద్వారా పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంటుంది. వాహన యోగం పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ మూలక ధన లాభం ఉంటుంది. ప్రముఖులతో పరిచ యాలు వృద్ధి చెందుతాయి. విదేశీయానానికి అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ కు లోటుండదు.

Latest Articles
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..