Chandradhi Yoga: చంద్రాధియోగంతో ఈ రాశుల వారికి అధికారం, ఆరోగ్యం, ఆదాయం..!
చంద్ర గ్రహం శుభ స్థానాల్లో సంచరిస్తూ, శుభ గ్రహాలకు 6,7,8 స్థానాల్లో ఉన్నప్పుడు చంద్రాధి యోగం ఏర్పడుతుంది. చంద్రుడు ఔషధి కారకుడు కూడా అయినందువల్ల ఈ చంద్రాధి యోగం వల్ల అధికారం దక్కడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జ్యోతిషశాస్త్రంలో ఈ యోగానికి అత్యంత ప్రాముఖ్యం ఉంది.
చంద్ర గ్రహం శుభ స్థానాల్లో సంచరిస్తూ, శుభ గ్రహాలకు 6,7,8 స్థానాల్లో ఉన్నప్పుడు చంద్రాధి యోగం ఏర్పడుతుంది. చంద్రుడు ఔషధి కారకుడు కూడా అయినందువల్ల ఈ చంద్రాధి యోగం వల్ల అధికారం దక్కడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జ్యోతిషశాస్త్రంలో ఈ యోగానికి అత్యంత ప్రాముఖ్యం ఉంది. ఈ నెల 15న కన్యారాశిలో ప్రవేశిస్తున్న చంద్రుడు ఈ నెల 23న ధనూరాశిలో ప్రవేశించేంత వరకూ ఈ చంద్రాధియోగం కొనసాగుతుంది. చంద్రుడి అనుకూలత వల్ల మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, ధనూ రాశుల వారికి అధికారం పట్టడానికి, ఆదాయం పెరగడానికి, ఆరోగ్యం మెరుగుపడడానికి అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశిలో ఉన్న కుజుడితో చంద్రుడికి సంపర్కం ఏర్పడుతున్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి ఉన్నత స్థానంలో ఉంటుంది. రావలసిన డబ్బు అందుతుంది. ఉద్యోగంలో అధికారం చేపట్టడం జరుగుతుంది. నిరు ద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఆదాయంలో చాలా భాగాన్ని పొదుపు చేయడం, ఖర్చులు తగ్గించుకోవడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశిలో ఉన్న గురువుతో చంద్రుడికి వీక్షణ ఏర్పడుతున్నందువల్ల ఊహించని విధంగా ఆదా యం పెరుగుతుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. అనా రోగ్యం నుంచి కోలుకోవడానికి వీలైన సరైన చికిత్స లభిస్తుంది. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
- కర్కాటకం: ఈ రాశ్యధిపతి అయిన చంద్రుడు మిత్ర క్షేత్రాలలో సంచారం చేయడమే కాకుండా, శుభ గ్రహాల వీక్షణ కూడా పొందుతున్నందువల్ల ఈ రాశివారికి అనేక శుభ ఫలితాలు, శుభ యోగాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడి, మానసికంగా ఊరట చెందడం జరుగుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యో గాల్లో తప్పకుండా హోదాలు పెరిగే అవకాశం ఉంది. ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది.
- తుల: ఈ రాశికి దశమాధిపతి అయిన చంద్రుడు అనుకూల స్థానాల్లో సంచారం చేయడం, పైగా శుభ గ్రహాల దృష్టి పడడం వల్ల ఉద్యోగ సంబంధమైన ప్రతి వ్యవహారమూ శుభ ఫలితాలనిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. అనా రోగ్యాల నుంచి చాలావరకు కోలుకోవడం జరుగుతుంది. అనేక విధాలైన ఒత్తిళ్ల నుంచి బయట పడడం, మనశ్శాంతి లభించడం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.
- వృశ్చికం: ఈ రాశికి చంద్రుడు భాగ్యాధిపతి కావడం, చంద్రుడి మీద గురువు దృష్టి పడడం వల్ల గజకేసరి యోగం ఏర్పడడం వల్ల అనేక వ్యవహారాల్లో విజయాలు లభిస్తాయి. శత్రువులు, పోటీదార్ల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. కలలో కూడా ఊహించని స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు కొదవ ఉండదు. విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశినాథుడైన గురువు దృష్టి చంద్రుడి మీద పడడం, గురు, చంద్రులు మిత్ర గ్రహాలు కావడం వల్ల ఈ రాశివారికి కొన్ని ఊహించని అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవ కాశం ఉంది. ఉద్యోగంలో అనుకోకుండా పదోన్నతి లభించడం, వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలు చేతికి అందడం వంటివి జరుగుతాయి. లాభదాయక స్నేహాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోవడం జరుగుతుంది.