Zodiac Signs: ఈ రాశుల వారు కొన్ని అంశాల్లో రహస్యం పాటిస్తారు.. ఫ్యామిలీతో కూడా షేర్ చేయరు..!
జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతక చక్రంలో అష్టమ (గుంభన) స్థానాధిపతి రహస్య కార్యకలాపాలు, రహస్య ఒప్పందాలు, రహస్య సంపాదన, రహస్య సంబంధాలను సూచిస్తాడు. అష్టమ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి లేదా అష్టమ స్థానాధిపతి స్థితిని బట్టి ఈ రహస్య వ్యవహారాలు ఏ విధంగా ఉండేదీ, ఏ స్థాయిలో ఉండేదీ చెప్పవలసి ఉంటుంది.
జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతక చక్రంలో అష్టమ (గుంభన) స్థానాధిపతి రహస్య కార్యకలాపాలు, రహస్య ఒప్పందాలు, రహస్య సంపాదన, రహస్య సంబంధాలను సూచిస్తాడు. అష్టమ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి లేదా అష్టమ స్థానాధిపతి స్థితిని బట్టి ఈ రహస్య వ్యవహారాలు ఏ విధంగా ఉండేదీ, ఏ స్థాయిలో ఉండేదీ చెప్పవలసి ఉంటుంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, కుంభ రాశుల వారికి కొన్ని అంశాల్లో రహస్యంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇందులో ఏ రాశివారికి ఏ విధమైన రహస్య కార్యకలాపాలు అవకాశం ఉన్నదీ పరిశీలిద్దాం.
- మేషం: ఈ రాశికి రాశ్యధిపతి, అష్టమాధిపతి ఒకడే కావడంతోపాటు, ఇదే రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. అష్టమాధిపతి కుజుడు ఇదే రాశిలో నెలంతా సంచారం చేస్తున్నందువల్ల రహస్య ఆదాయానికి, రహస్య సంపాదనకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మూడో కంటికి తెలియకుండా డబ్బు దాచడం జరుగుతుంది. ఆదాయ వృద్ధికి సంబంధించిన ఆలోచనలు పెరిగి, అక్రమంగా కూడా డబ్బు సంపాదించవచ్చు. ఆస్తిపాస్తులపై పెట్టుబడులు పెంచడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశికి అష్టమాధిపతి అయిన గురువు ఇదే రాశిలో ఉన్నందువల్ల ఈ రాశివారు ఎవరికీ తెలియకుండా ఆర్థిక ఒప్పందాలు కుదర్చుకోవడం, ఆస్తిపాస్తులు పెంచుకోవడం, రెండవ బ్యాంక్ ఖాతాను ప్రారంభించడం వంటివి జరిగే అవకాశం ఉంది. సంపన్న వ్యక్తితో రహస్య సంబంధాలను ఏర్పరచుకునే సూచనలు కూడా ఉన్నాయి. లాభదాయకమైన ఆర్థిక లావాదేవీల వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం జరుగుతుంది. సాధారణంగా ఆర్థిక వ్యవహారాలకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశివారికి అష్టమ స్థానాధిపతి శని అష్టమ స్థానంలోనే ఉన్నందువల్ల తప్పకుండా ఆదనపు ఆదాయ మార్గాలకు, అదనపు ఉద్యోగాలకు బాగా అవకాశం ఉంది. కొంతమంది ఇష్టమైన బంధువులకు కుటుంబానికి తెలియకుండా సహాయం చేసే అవకాశం కూడా ఉంది. ఎవరికీ తెలియని ఒక అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. సాధారణంగా ఏ విషయమూ ఎవరి తోనూ పంచుకోని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయ వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుంది.
- కన్య: ఈ రాశికి అష్టమాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలోనే ఉన్నందువల్ల అదనపు ఆదాయ మార్గాలను రహస్యంగా ఉంచడం జరుగుతుంది. కొందరు మిత్రుల సహాయంతో వ్యసనాలకు అలవాటు పడే అవకాశం కూడా ఉంటుంది. భూ సంబంధమైన ఆస్తుల కొనుగోలు ఒప్పందాలు జరుగుతాయి. ముఖ్యంగా ఏ విషయాన్నయినా కుటుంబానికి తెలియకుండా గోప్యంగా ఉంచే తత్వం అలవడుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి అష్టమాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానంలోనే ఉన్నందువల్ల రహస్యంగా ఆస్తి ఒప్పందాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరిగినప్పటికీ కుటుంబంతో ఈ విషయాలను పంచుకోవడం జరగకపోవచ్చు. రహస్యంగా ఫిక్సెడ్ డిపాజిట్లు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాక, రహస్య కార్యకలాపాలకు, రహస్య సంబంధాలకు కూడా అవకాశం ఉంది.
- కుంభం: ఈ రాశివారికి అష్టమ స్థానంలో ఉన్న కేతువు వల్ల రహస్య సంబంధాలకు, ప్రణయాలకు బాగా అవకాశం ఉంది. ఆదాయం పెరిగినప్పటికీ దాన్ని వ్యసనాల మీదా, రహస్య సంబంధాల మీదా ఖర్చు పెట్టే సూచనలున్నాయి. జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకున్నప్పటికీ బయటకు చెప్పకపోవడం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఈ ప్రయత్నాలు, సానుకూలతల విషయంలో గోప్యత పాటించడం జరుగుతుంది.