AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: మిథున రాశిలో రెండు శుభ గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి పండగే పండగ..!

ఈ నెల 15 న బుధ, శుక్రులు మిథున రాశిలో కలవడం జరుగుతోంది. ఇవి ఇదే రాశిలో ఈ నెల 29 వరకూ కొనసాగుతాయి. ఏదైనా రాశిలో రెండు శుభ గ్రహాలు కలుస్తున్నాయంటే ఆ రాశితో పాటు మరికొన్ని రాశులకు శుభ ఫలితాలే ఎక్కువగా అనుభవానికి వస్తాయి. కొన్ని ప్రయత్న పూర్వకంగా, కొన్ని అప్రయత్నంగా శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది.

Zodiac Signs: మిథున రాశిలో రెండు శుభ గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి పండగే పండగ..!
Zodiac Signs
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 13, 2024 | 5:50 PM

Share

ఈ నెల 15 న బుధ, శుక్రులు మిథున రాశిలో కలవడం జరుగుతోంది. ఇవి ఇదే రాశిలో ఈ నెల 29 వరకూ కొనసాగుతాయి. ఏదైనా రాశిలో రెండు శుభ గ్రహాలు కలుస్తున్నాయంటే ఆ రాశితో పాటు మరికొన్ని రాశులకు శుభ ఫలితాలే ఎక్కువగా అనుభవానికి వస్తాయి. కొన్ని ప్రయత్న పూర్వకంగా, కొన్ని అప్రయత్నంగా శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. ఇటువంటి శుభ గ్రహాలు కలిసిన సమయంలో ఎటువంటి ప్రయత్నం చేపట్టినా, ఎటువంటి కార్యక్రమం మొదలు పెట్టినా సత్ఫలితాలు లభిస్తాయి. బుధ, శుక్ర గ్రహాలు కలిసినప్పుడు కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ధన ప్రవాహం ఉంటుంది. వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశుల వారి జీవితం నిత్య కల్యాణం, పచ్చ తోరణంలా సాగిపోతుందనడంలో సందేహం లేదు.

  1. వృషభం: ఈ రాశ్యధిపతి శుక్రుడు ధన స్థానంలో ధనాధిపతి బుధుడితో కలవడం వల్ల అనేక విధాలుగా కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఏకంగా రెండు వారాల పాటు ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ధన ధాన్య వస్తు సమృద్ధికి అవకాశముంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. సాధారణ స్థితి నుంచి సంపన్న స్థితికి ఎదగడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక బలం బాగా పెరుగుతుంది. సమాజంలో మాటకు విలువ లభిస్తుంది.
  2. మిథునం: స్వస్థానంలోకి రాశ్యధిపతి బుధుడు ప్రవేశించడం ఒక విశేషం కాగా, దానితో శుక్రుడు కలవడం మరో విశేషం. ఈ రాశివారికి పధ్నాలుగు రోజుల పాటు నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపో తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు వెడతారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. సామాజికంగా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది.
  3. సింహం: ఈ రాశివారికి రాశ్యధిపతి రవి లాభ స్థానంలో ఉండడంతో పాటు, ఇదే రాశిలో రెండు శుభ గ్రహాలు చేరడం వల్ల ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మెరుగుపడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విలువైన ఆస్తి కలిసి వస్తుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యో గాల్లో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారాలు లాభాల బాటలో దూసు కుపోతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కొత్త ప్రయత్నాలకు ఇది మంచి సమయం.
  4. కన్య: ఈ రాశికి దశమ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో శుక్రుడి కలయిక వల్ల ఈ రాశివారికి ధర్మ కర్మాధిప యోగమనే అరుదైన యోగం ఏర్పడింది. వృత్తి, ఉద్యోగాల్లో వీరి ప్రాభవం బాగా పెరిగి పోతుంది. ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరుకుంటారు. సహాయం పొందిన వ్యక్తులు సహాయం చేసే స్థాయికి ఎదుగుతారు. ఏ రంగంలో ఉన్నా ఆశించిన గుర్తింపు లభించ డంతో పాటు హోదా పెరగడానికి అవకాశముంటుంది. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి.
  5. తుల: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు భాగ్య స్థానంలో భాగ్యాధిపతి బుధుడితో కలవడం వల్ల వీరికి మహా భాగ్య యోగం పడుతోంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులు, ఉద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. విదేశీయానానికి, విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఆటంకాలు తొలగిపోతాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధమే కుదిరే అవకాశముంది. పిత్రార్జితం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు.
  6. కుంభం: ఈ రాశికి అత్యంత శుభులైన బుధ, శుక్రులు పంచమ కోణంలో కలవడం వల్ల వృత్తి, ఉద్యోగా ల్లోనూ, కుటుంబంలోనూ ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనేక విధా లుగా ఆదాయం పెరిగి, సంపన్న స్థితికి చేరడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగు తాయి. ప్రతిభా పాటవాలకు సర్వత్రా గుర్తింపు లభిస్తుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది.

యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు