Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగాల్లో హోదా పెరగే అవకాశం.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు
దిన ఫలాలు (జూన్ 14, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఊహించని రీతిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వృషభ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. మిథున రాశి వారు ఆర్థిక లావాదేవీలకు కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (జూన్ 14, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఊహించని రీతిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వృషభ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. మిథున రాశి వారు ఆర్థిక లావాదేవీలకు కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడం మీద దృష్టి పెడతారు. ఊహించని రీతిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. కుటుంబసమేతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొం టారు. తలపెట్టిన పనులన్నిటినీ సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆదాయ వృద్ధికి అవకాశముంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. సహాయం పొందిన స్నేహితులు ముఖం చాటేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. దాదాపు ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. వ్యాపారాలు ఆర్థిక సమస్యలు, నష్టాల నుంచి కొద్దిగా బయటపడతాయి. ఉద్యోగంలో పని భారం తగ్గుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలకు కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల ఒత్తిడి ఎక్కు వగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తేలికగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో తొంద రపాటు మాటలు మాట్లాడకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగి పోతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
మంచి పరిచయాలు ఏర్పడతాయి. మాటకు విలువ పెరుగుతుంది. అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది కానీ, ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగానికి సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. కొందరు మిత్రులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. తల పెట్టిన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో పురోగమిస్తాయి. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంచనాకు మించి లాభాలు అందుకుం టారు. ఉద్యోగంలో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. అధికారుల నుంచి వేధింపులు ఉండవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుండ వచ్చు. బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా నెరవేరుతుంది. సమయం బాగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. వ్యాపారంలో కొన్ని మార్పులు చేపడతారు. పోటీదార్లు బాగా తగ్గి ఉంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థిక నిర్వహణలో కొద్దిగా పొరపాట్లు చోటు చేసుకునే అవకాశం ఉంది. అనవసర ఖర్చుల మీద డబ్బు బాగా వృథా అయ్యే అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రులతో మాట పట్టింపులు తలెత్తే సూచనలున్నాయి. ప్రయాణాల వల్ల లాభముంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పరిస్థితులు అనుకూ లంగా మారతాయి. ఉద్యోగ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. కొద్దిగా ఒత్తిడి ఉన్నా పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రతి పనీ సంతృప్తికరంగా పూర్తవుతుంది. కొద్ది ప్రయ త్నంతో కొన్ని కీలక సమస్యలు పరిష్కారమవుతాయి. ఇతరుల సమస్యల్లో తలపెట్టడం మంచిది కాదు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెడతారు. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువుల రాకపోకలుంటాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. కొందరు బంధువులకు సహాయపడతారు. కీలకక విషయాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. తల్లితండ్రుల అండదండలు లభిస్తాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. మీ పట్ల అధికారులకు సదభిప్రాయం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీ అయిపోవడంతో విశ్రాంతి తగ్గుతుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి, వేధింపులకు అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడితో మన శ్శాంతి తగ్గుతుంది. అధికారులు అతిగా ఉపయోగించుకోవడం కూడా జరుగుతుంది. ఆర్థిక పరి స్థితి పరవాలేదనిపిస్తుంది. వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు ప్రవేశపెడతారు. నిరుద్యోగుల ప్రయ త్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ప్రయాణాల్లో ఇబ్బం దులు ఎదురవుతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఏ పని తలపెట్టినా వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. స్వల్ప అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. ముఖ్యమైన పనులు బాగా ఆలస్యం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సమేతంగా ఆల యాలు సందర్శిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగి పోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.