- Telugu News Photo Gallery Do not do this while going out in the sun, check here is details in Telugu
Summer Care: ఎండలో బయటకు వెళ్లేటప్పుడు ఈ పనులు చేస్తున్నారా.. జాగ్రత్త సుమీ!
ఓ వైపు నుంచి వర్షాలు పడుతున్నా కూడా.. మరో వైపు ఎండలు దంచి కొడుతూనే ఉంటున్నాయి. ఓ రోజు చల్లగా ఉంది హమ్మయ్యా అనుకునేలోపు.. ఎండ వేడితో ఉక్కపోత పెరుగుతుంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం పది గంటల సమయంలో కూడా బయటకు వెళ్లాలంటే జనం ఆలోచిస్తున్నారు. మరి బయట పనులకు వెళ్లే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. ఈ ఎండ వేడిని తట్టుకోవడానికి తెలిసీ తెలియక చాలా మంది చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. వీటి వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినే..
Updated on: Jun 14, 2024 | 3:34 PM

ఓ వైపు నుంచి వర్షాలు పడుతున్నా కూడా.. మరో వైపు ఎండలు దంచి కొడుతూనే ఉంటున్నాయి. ఓ రోజు చల్లగా ఉంది హమ్మయ్యా అనుకునేలోపు.. ఎండ వేడితో ఉక్కపోత పెరుగుతుంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం పది గంటల సమయంలో కూడా బయటకు వెళ్లాలంటే జనం ఆలోచిస్తున్నారు.

మరి బయట పనులకు వెళ్లే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. ఈ ఎండ వేడిని తట్టుకోవడానికి తెలిసీ తెలియక చాలా మంది చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. వీటి వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. వీటి వల్ల అనేక రకాల సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బయటకు వెళ్లినప్పుడు చాలా మంది.. ఎక్కడి పడితే అక్కడ నీళ్లు తాగుతూ ఉంటారు. అలాగే జ్యూసులు, చెరుకు రసం, ఇతర చల్లని పానీయాలు, కొబ్బరి బొండాలు తాగుతారు. కొబ్బరి బోండాలు మినహా.. మిగతా ఏ పానీయాలు అయినా కలుషితం అయ్యే అవకాశం ఉంది.

ఇలాంటివి తాగడం వల్ల డయేరియా రావచ్చు. డయేరియా వచ్చిందంటే.. కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు తీవ్రంగా అవుతాయి. చాలా నీరసంగా, ఆహారం తీసుకోవాలని పించదు. ప్రాణాల మీదకు కూడా రావచ్చు.

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు ఇంటి నుంచే నీటిని తీసుకెళ్లండి. బయట నీరు అంత మంచిది కాదు. అలాగే బయట ఒక వేళ ఏమైనా తాగాలి అనిపిస్తే.. కొబ్బరి బోండాలు మాత్రమే తీసుకోవాలి. బయట నుంచి వచ్చిన ఓ అరగంట తర్వాత సాధారణ చల్లటి నీటితో స్నానం చేయాలి.




