- Telugu News Photo Gallery Cinema photos IS Allu Arjun Pushpa 2 Movie Postponed news Goes Viral in social media Telugu Heroes Photos
Allu Arjun – Pushpa 2: అల్లు అర్జున్ అభిమానులకు ఊహించని షాక్.! ఆ విషయంలోనేనా.?
పేరాలకు పేరాలు ఆరాలు తీయట్లేదు.. అటుతిప్పి ఇటుతిప్పి మాట్లాడట్లేదు... మేం ఒకటే ప్రశ్న అడుగుతున్నాం.. సమాధానం చెప్పండి చాలు అంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అంతగా వాళ్లు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా..? పుష్ప 2 అనుకున్న టైమ్‌కు వస్తుందా లేదంటే వాయిదా పడుతుందా..? కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారా..? అల్లు అర్జున్ ఫోకస్ అంతా కొన్ని రోజులుగా పుష్ప 2పైనే ఉంది. దీని కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు బన్నీ.
Updated on: Jun 14, 2024 | 3:34 PM

పేరాలకు పేరాలు ఆరాలు తీయట్లేదు.. అటుతిప్పి ఇటుతిప్పి మాట్లాడట్లేదు... మేం ఒకటే ప్రశ్న అడుగుతున్నాం.. సమాధానం చెప్పండి చాలు అంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అంతగా వాళ్లు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా..?

ఆల్రెడీ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. షెడ్యూల్ గ్యాప్స్‌లో ఎడిటింగ్‌తో పాటు ఇంత కార్యక్రమాలు చక్కబెట్టేస్తున్నారు సుక్కు అండ్ హిజ్ టీమ్. అందుకే ఆఫ్టర్ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైమ్ తీసుకోవట్లేదు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్ట్ 15న పుష్ప 2ను విడుదల చేయాలనేది మేకర్స్ ప్లాన్. కానీ షూటింగ్ తీరు చూస్తుంటే.. అనుకున్న తేదీకి రావడం కష్టమే అనిపిస్తుంది. ఆగస్ట్ 15కి రావడం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. ఇప్పటికీ ఇచ్చిన మాటపై నిలబడి.. చెప్పిన తేదికి పుష్ప 2ను తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు సుకుమార్.

ఆ డేట్‌మీద ఎంత మంది ఖర్చీఫులు ఉన్నా సరే, అసలు తగ్గేదేలే అంటూ రావడానికి ఐకాన్ స్టార్ సిద్ధం అంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు ఫ్యాన్స్. పుష్ప ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. ఫాహద్ ఫాజిల్ రిలేటెడ్ స్టఫ్‌ని షూట్ చేస్తున్నారు మేకర్స్.

ఆల్రెడీ పుష్ప 2 మీద పాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ హైప్‌ను మరింత పెంచేలా స్కెచ్ రెడీ చేస్తున్నారు. మేకింగ్ నుంచి ప్రమోషన్స్ వరకు ఏ విషయంలోనూ తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నారు పుష్ప రాజ్.

సూసేకీ సాంగ్ వైబ్‌ని షేర్ చేసుకుంటూ డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా సినిమాను విడుదల చేస్తున్నామంటూ క్లారిటీగా చెప్పేసింది టీమ్. పుష్పరాజ్ రావడం పక్కా అంటూ ఢంకా మోగిస్తున్నారు అభిమానులు.





























