- Telugu News Photo Gallery Cinema photos Pawan kalyan perfect planning in Akira Nandan Future Telugu Heroes Photos
Pawan Kalyan-Akira Nandan: పవన్ పర్ఫెక్ట్ ప్లాన్.. ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా అకీరా నందన్ ఫేమస్.
రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఇకపై చాలా బిజీగా ఉండబోతున్నారు.. పైగా ఆయనిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కూడా..! అందుకే ఇదివరకట్లా సినిమాలు చేయడం కుదరదు. అందుకే తన స్థానంలో తనయుడిని ఫ్యాన్స్‌కి చేరువ చేస్తున్నారా..? కొన్ని రోజులుగా అకీరా పబ్లిక్ ఈవెంట్స్‌లో కనిపించడానికి కారణమదేనా..? అకీరా అరంగేట్రానికి సమయం ఆసన్నమైందా..? ఎక్కడైనా తండ్రి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నపుడు.. ఆ బరువును వారసుడికి అప్పజెప్తుంటారు.
Updated on: Jun 14, 2024 | 3:50 PM

రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఇకపై చాలా బిజీగా ఉండబోతున్నారు.. పైగా ఆయనిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కూడా..! అందుకే ఇదివరకట్లా సినిమాలు చేయడం కుదరదు. అందుకే తన స్థానంలో తనయుడిని ఫ్యాన్స్‌కి చేరువ చేస్తున్నారా..? కొన్ని రోజులుగా అకీరా పబ్లిక్ ఈవెంట్స్‌లో కనిపించడానికి కారణమదేనా..?

అకీరా అరంగేట్రానికి సమయం ఆసన్నమైందా..? ఎక్కడైనా తండ్రి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నపుడు.. ఆ బరువును వారసుడికి అప్పజెప్తుంటారు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఇదే చేస్తున్నారేమో అనిపిస్తుంది.

రాజకీయంగా ఇకపై తాను బిజీ అవుతానని తెలిసే.. అకీరా నందన్‌ను ఆడియన్స్‌కు చేరువ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మొన్నటి వరకు అరుదుగా కనిపించిన అకీరా.. ఎన్నికల తర్వాత తండ్రి దగ్గరే ఉన్నారు.

ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత.. వారసుడిని ఇటు చంద్రబాబు.. అటు ప్రధాని మోదీ దగ్గరికి తీసుకెళ్లారు పవన్. నేషనల్ వైడ్‌గా అకీరా నందన్‌ను ఫేమస్ అయ్యేలా చేసారు పవన్.

ఈ గుర్తింపు రేపు అకీరా మొదటి సినిమాకు హెల్ప్ అవుతుందనడంలో సందేహమేం లేదు. ఇప్పటికైతే క్లారిటీ లేదు కానీ కచ్చితంగా త్వరలోనే అకీరా ఎంట్రీ ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. అకీరా నందన్‌కు ఇప్పుడు 20 ఏళ్ళు.

నిన్న మొన్నటి వరకు చిన్న పిల్లాడిలా కనిపించినా.. ఇప్పుడు మాత్రం హీరో మెటీరియల్‌లా మేకోవర్ అయ్యారు. ఒప్పుకున్న ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ పూర్తి చేసాక.. పవన్ పూర్తిగా పాలిటిక్స్‌పై ఫోకస్ చేయడం ఖాయం. ఆ తర్వాత పవన్ స్థానాన్ని జూనియర్ పవర్ స్టార్ భర్తీ చేయాలని చూస్తున్నారు.




