Borage Starflower Benefits: తైవాన్ పర్వతాల్లో సేకరించిన ఈ మూలిక.. జుట్టు సమస్యలకు దివ్యౌషధం!

తైవాన్ హెర్బ్ చాలా ప్రత్యేకమైనది. దీనిని నక్షత్రంలా కనిపిస్తుంది. కాబట్టి దీనిని స్టార్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. ఈ పువ్వు నీలం రంగులో ఉంటుంది. తేనెలాగా తీపిగా ఉంటుంది. ఇది ఒక రకమైన పువ్వు కానీ, ఇందులో కొంత భాగం తినదగినది కూడా. దీన్ని ఎండబెట్టి నిల్వ ఉంచి మూలికలుగా వాడతారు.

Borage Starflower Benefits: తైవాన్ పర్వతాల్లో సేకరించిన ఈ మూలిక.. జుట్టు సమస్యలకు దివ్యౌషధం!
Herb Borage Starflower
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 14, 2024 | 6:15 PM

ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి మూలికలు చాలా ఉన్నాయి. ఇవి మన శరీరానికి, జుట్టుకు, చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. అటువంటి మూలికలలో ఒకటి బోరేజ్. దీనిని స్టార్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. తైవాన్‌లో కనిపించే ఈ పువ్వు ఎంత అందంగా ఉంటుందో, మన జుట్టుకు కూడా అంతకంటే చాలా రెట్లు ఎక్కువ ప్రయోజనకరంగా పనిచేస్తుంది. మీరు కూడా జుట్టుకు సంబంధించిన కొన్ని సమస్యలతో పోరాడుతున్నట్లయితే ఈ తైవాన్ హెర్బ్ గుణాలను తెలుసుకోవాలి. ఎందుకంటే, ఇది మీ జుట్టు సమస్యలకు దివ్యౌషధం. తైవాన్‌ హెర్బ్‌ ప్రయోజనాలు, ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

తైవాన్ హెర్బ్ చాలా ప్రత్యేకమైనది. దీనిని నక్షత్రంలా కనిపిస్తుంది. కాబట్టి దీనిని స్టార్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. ఈ పువ్వు నీలం రంగులో ఉంటుంది. తేనెలాగా తీపిగా ఉంటుంది. ఇది ఒక రకమైన పువ్వు కానీ, ఇందులో కొంత భాగం తినదగినది కూడా. దీన్ని ఎండబెట్టి నిల్వ ఉంచి మూలికలుగా వాడతారు.

బోరేజ్ నుండి తయారైన నూనె ప్రయోజనాలు..

ఇవి కూడా చదవండి

తైవాన్‌లో లభించే బోరేజ్ పువ్వు ఒక ఔషధం. ఇది అనేక జుట్టు సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. బోరేజ్ గింజల నుండి తయారైన నూనెలో గామా-లినోలెనిక్ యాసిడ్ (GLA) ఉంటుంది. ఇది ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ రకం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జుట్టుకు దీని వల్ల కలిగే ప్రయోజనాలను బోలేడున్నాయి.

బోరెజ్‌లో గామా-లినోలెనిక్ యాసిడ్ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది తలలోపల జుట్టును హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు సహజ నూనె ఉత్పత్తిని పెంచుతుంది. జుట్టు మృదువుగా, మెరిసేలా,యు సిల్కీగా మార్చేస్తుంది.

ఈ స్టార్ ఫ్లవర్‌లో విటమిన్ B7, జింక్, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. దాని నుండి తయారైన నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో కొత్త జుట్టు వేగంగా పెరుగుతుంది. బోరెజ్ ఆయిల్ జుట్టును బలోపేతం చేయడంతో పాటు, జుట్టు రాలిపోవడం, చిరిగిపోవడాన్ని కూడా తగ్గిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..