Copper cleaning: రాగి పాత్రలు కొత్తవాటిలా మెరవాలంటే ఇలా క్లీన్ చేయండి.. తళతళ మెరుస్తాయ్..
ఇంకా రాగి, ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి చింతపండు, నిమ్మకాయ చిట్కాలు అందరికీ తెలిసిందే. వీటితో కూడా మీ ఇంట్లోని రాగి, ఇత్తడి పాత్రలు, పూజా సామాగ్రి కొత్త వాటిలా తళతళ మెరిసిపోతాయ్.
సాధారణంగా కిచెన్‌లో చాలా రకాల పాత్రలు వాడుతుంటారు. వీటిలో స్టీల్, అల్యూమినియం, గాజు, ఇత్తడితో చేసిన పాత్రలు ఎక్కువగా ఉంటాయి. కానీ, కొన్ని ఇళ్లలో రాగి పాత్రలు కూడా వాడుతుంటారు. పూర్వ కాలంలో రాగి పాత్రలను ఎక్కువగా ఉపయోగించేవారు. ఆహారం కూడా రాగి ప్లేట్లలో వడ్డించేవారు. గ్రామాల్లో నేటికీ రాగి పాత్రలను ఉపయోగిస్తున్నారు వారు ఎక్కువగానే ఉన్నారు. రాగి పాత్రలు మన ఆరోగ్యానికి ప్రయోజనకరమైనవిగా పరిగణించబడతాయి. ఇంకా, రాగి పాత్రలో నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు ఇప్పటికే తెలుసు.
మరోవైపు రాగి పాత్రలో ఆహారం తీసుకుంటే శరీరంలోని వ్యాధులు నయమవుతాయని కూడా చెబుతారు. అయితే ఈ పాత్రలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రాగి వంటసామాను సరిగ్గా నిర్వహించనట్లయితే కాలక్రమేణా అవి నల్లగా మారుతుంటాయి. కానీ సరైన క్లీనింగ్, మెయింటెనెన్స్ ఉంటే ఈ పాత్రలను ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంచవచ్చు. కాబట్టి, రాగి పాత్రలను సులభంగా ఎలా శుభ్రం చేయాలో తెలుసుకోవటం కూడా ముఖ్యమైన విషయమే. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
రాగి పాత్రలను శుభ్రం చేయడానికి నిమ్మరసం, డిష్ వాష్ లిక్విడ్, బేకింగ్ సోడా, వెనిగర్ (ఎ) నిమ్మరసం, ఉప్పు తీసుకోవాలి. తర్వాత వీటిని కలిపి కరిగించుకోవాలి. ఇప్పుడు రాగి పాత్రను నీటిలో బాగా నానబెట్టి, కరిగిన మిశ్రమాన్ని పాత్ర మొత్తం పోసి కొన్ని నిమిషాల పాటు నాననివ్వండి. ఆ తర్వాత పాత్రను బాగా రుద్ది కడగాలి. ఇక మీ పాత్ర మెరుస్తుంది అంతే.
లేదంటే, ఉప్పు, వెనిగర్ వాడి మీ రాగి పాత్రలను శుభ్రంగా, మెరిసేలా చేసుకోవచ్చు. ఇందుకోసం ఉప్పు, వెనిగర్‌లను రాగి వస్తువుల మీద వేస్తే రాగి ఆక్సీకరణం చెందడాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల అది నల్లగా మారకుండా ఉంటుంది. అందుకే ఉప్పు, వెనిగర్‌ల మిశ్రమంతో గట్టి రుద్ది కడిగితే మురికి నెమ్మదిగా తొలగిపోతూ ఉంటుంది. పూర్తిగా పోయేవరకు ఈ మిశ్రమంతో రుద్దాలి. తర్వాత కడిగేసి మెత్తని గుడ్డతో తుడిచేసుకోవాలి.
రాగి పాత్రలను శుభ్రం చేసేందుకు మరో మార్గం కూడా ఉంది. ఇక్కడ ఉప్పు, వెనిగర్ తీసుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక కప్పు వెనిగర్ వేసి బాగా కలపాలి. అవి నీళ్లలో బాగా కలిసిపోయిన తరువాత అందులో రాగి సామాన్లను వేయండి. తర్వాత దీన్ని స్టౌ మీద పెట్టండి. నీళ్లు మరిగేవరకు అలాగే ఉంచండి. మురికి మొత్తం నీళ్లలోకి వచ్చేస్తుంది. మీ వస్తువులు తళతళ మెరుస్తాయి. నీళ్లు చల్లబడిన తరువాత తీసి సబ్బుతో క్లీన్ చేయాలి. తరువాత వేడి నీటితో కడిగి, మెత్తటి పొడి బట్టతో నీట్‌గా తుడిచేసుకోవాలి.
ఇంకా రాగి, ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి చింతపండు, నిమ్మకాయ చిట్కాలు అందరికీ తెలిసిందే. వీటితో కూడా మీ ఇంట్లోని రాగి, ఇత్తడి పాత్రలు, పూజా సామాగ్రి కొత్త వాటిలా తళతళ మెరిసిపోతాయ్.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..