Variety Wedding Card: వెరైటీ పెళ్లి కార్డు.. ఎంత ఎంబసీలో పని చేస్తే మాత్రం ఇలా ప్రింట్ చేస్తారా..?

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో స్వీట్‌ మెమరీ. వెడ్డింగ్‌ కార్డ్‌ మొదలుకొని పెళ్లి మంటపం వరకు స్పెషల్‌గా ఉండాలనుకుంటారు. లేటెస్ట్‌గా తన కుమారుడి పెళ్లి కార్డును వెరైటీగా ప్రింట్‌ చేయించింది ఓ వధువు తల్లి. ఇప్పుడీ ఇన్విటేషన్‌ కార్డే అక్కడ హాట్‌ టాపిక్‌గా మారింది. జనరల్‌గా శుభలేఖ అహ్వానిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ కనిపిస్తున్నది పాస్‌పోర్ట్‌ కార్డు.

Variety Wedding Card:  వెరైటీ పెళ్లి కార్డు.. ఎంత ఎంబసీలో పని చేస్తే మాత్రం ఇలా ప్రింట్ చేస్తారా..?
Passport Wedding Card
Follow us
Sudhir Chappidi

| Edited By: Balaraju Goud

Updated on: Jun 14, 2024 | 6:13 PM

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో స్వీట్‌ మెమరీ. వెడ్డింగ్‌ కార్డ్‌ మొదలుకొని పెళ్లి మంటపం వరకు స్పెషల్‌గా ఉండాలనుకుంటారు. లేటెస్ట్‌గా తన కుమారుడి పెళ్లి కార్డును వెరైటీగా ప్రింట్‌ చేయించింది ఓ వరుడి తల్లి. ఇప్పుడీ ఇన్విటేషన్‌ కార్డే అక్కడ హాట్‌ టాపిక్‌గా మారింది. జనరల్‌గా శుభలేఖ అహ్వానిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ కనిపిస్తున్నది పాస్‌పోర్ట్‌ కార్డు. ఇది నిజమైన పాస్‌పోర్ట్ లేదా మరే మరేదైనా అని పరిశీలిస్తే గాని చెప్పలేం. ఇక్కడ మనం చూస్తున్నది వెడ్డింగ్ పాస్‌పోర్ట్. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వివాహాలకు పిలిచే పెళ్లి కార్డులు రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వారు చేసే పని విధానాలకు అనుగుణంగా ఇప్పటికే చాలా రకాల పెళ్లి కార్డులను మనం చూస్తూఉన్నాం. అయితే ఇప్పుడు మనం చూస్తున్న పెళ్లి కార్డు పాస్ట్‌పోర్ట్‌ను పోలిన వెడ్డింగ్ కార్డు. విమానం ఎక్కడానికి విదేశాలకు వెళ్లడానికి కావలసిన అతి ముఖ్యమైన పాస్‌పోర్ట్ నమూనాతో పెళ్ళి కుమారుడి తల్లి తన కొడుకు పెళ్లి కార్డును ఈ మాదిరి తయారు చేయించి బంధువులను ఆహ్వానిస్తున్నారు.

కువైట్ ఎంబసీలో పనిచేసే భారతీయ తెలుగు మహిళ రషీదా తన కొడుకు వివాహ పత్రికను పాస్‌పోర్ట్ నమూనాతో తయారు చేయించారు. టక్కున చూస్తే అచ్చం పాస్‌పోర్ట్ మాదిరిగా కనిపించే విధంగా ప్రింటింగ్ చేయించారు. వెడ్డింగ్ పాస్‌పోర్ట్ అని అచ్చం పాస్‌పోర్ట్, వీసా మీద ఏ విధంగా అయితే లెటర్స్ ఉంటాయో ఆ విధమైన లెటర్స్ తో ముద్రణ చేయించారు. అలాగే ఫ్లైట్ టికెట్లు నమూనాను పోలిన రిసెప్షన్, పెళ్లిరోజు తేదీలను ముద్రించి కార్డును చూడముచ్చటగా తయారు చేశారు.

అందులో పెళ్లికి సంబంధించి వెడ్డింగ్ పార్ట్ పేరుతో పెళ్లి రోజు తేదీలను సమయాన్ని పెళ్లి జరిగే ప్రదేశాన్ని వధూవరుల పేర్లను ముద్రించా.రు మరొక ఫ్లైట్ టికెట్ పోలిన కార్డులు రిసెప్షన్ పాస్ అనే పేరుతో రిసెప్షన్ జరిగే సమయం తేదీ వధూవరుల పేర్లను ముద్రించి బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నారు. వీరి వివాహం గోవా పక్కనే ఉన్న బెల్గావీలో జరుగుతుండగా రిసెప్షన్ మాత్రం ఆంధ్రప్రదేశ్లోని గూడూరు జిల్లాలో పెళ్లి కుమారుని ఇంటి దగ్గర జరగనుంది. ఏది ఏమైనా కువైట్‌లో పనిచేస్తున్న రషీదా అనే మహిళ తన కొడుకు వివాహానికి అందర్నీ ఆకట్టుకునే విధంగా తను పనిచేసే ఉద్యోగాన్ని గుర్తు చేసే విధంగా పాస్‌పోర్ట్ నమూనాతో వివాహ పత్రికలను తయారు చేయించి బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నారు. దీంతో తన వినూత్న ఆలోచనకు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..