Viral Video: ఉన్నట్టుండి చేతిపై కాటేసిన పాము.. పట్టుకోబోతుండగా ఊహించని షాక్.. ఆ తర్వాత ఇది సీన్

పాములకు సంబంధించిన వీడియోలు అనేకం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంటాయి. సాధారణంగా దూరం నుంచి పామును చూస్తేనే భయపడిపోతాం. అలాంటిది దానితో ఆటలా.. ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే. అయితే స్నేక్ క్యాచర్ లాంటివారు ఎంతో చాకచక్యంగా పాములను పట్టుకుని..

Viral Video: ఉన్నట్టుండి చేతిపై కాటేసిన పాము.. పట్టుకోబోతుండగా ఊహించని షాక్.. ఆ తర్వాత ఇది సీన్
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 14, 2024 | 1:57 PM

పాములకు సంబంధించిన వీడియోలు అనేకం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంటాయి. సాధారణంగా దూరం నుంచి పామును చూస్తేనే భయపడిపోతాం. అలాంటిది దానితో ఆటలా.. ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే. అయితే స్నేక్ క్యాచర్ లాంటివారు ఎంతో చాకచక్యంగా పాములను పట్టుకుని అడవుల్లో వదిలిపెడుతుంటారు. ఇక తాజాగా ఈ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూస్తే కచ్చితంగా మీరు షాక్ కావడం ఖాయం. ఇందులో ఓ స్నేక్ క్యాచర్ పామును పట్టుకోబోతుండగా.. ఉన్నట్టుండి అది అతడ్ని కాటేస్తుంది. ఆ తరవాత ఏం జరిగింది.

వైరల్ వీడియో.. ఓ ప్రాంతంలో పాము సంచరిస్తోందని తెలుసుకున్న ఒక స్నేక్ క్యాచర్.. దాన్ని పట్టుకునేందుకు అక్కడికి చేరుకున్నాడు. గడ్డిలో ఉన్న ఆ పామును వెతికి మరీ దాని తోక పట్టుకున్నాడు. ఇంతలో ఉన్నట్టుండి అది అతడి చేతి మీద కాటు వేస్తుంది. గట్టిగా తన పదునైన కోరలతో పట్టుకుంటుంది. దీంతో కాసేపు నొప్పితో విలవిల్లాడిన స్నేక్ క్యాచర్.. ఏమాత్రం భయపడకుండా.. దాని పట్టు నుంచి ఎలాగోలా తప్పించుకున్నాడు. అయితే ఈ క్రమంలో అతడి చేతికి గాయమైంది. రక్తం కూడా కారుతుంది.

కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పాము విషపూరితం కాకపోవడంతో అంతా హమ్మయ్య..! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఎదుటవారికీ అవగాహన కల్పించేందుకు.. మీరు చేసిన ఈ ఫీట్ సూపర్ బ్రో.. అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: మరీ ఇలా ఉన్నావ్.. ఇదేం కోరిక తల్లి.. ఆమె ఆశలు విన్నారంటే మగాళ్ల గుండెలు హడల్

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి