AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మరీ ఇలా ఉన్నావ్.. ఇదేం కోరిక తల్లి.. ఆమె ఆశలు విన్నారంటే మగాళ్ల గుండెలు హడల్

పెళ్లి అనేది నూరేళ్ల పంట అని అనుకుంటుంది నిన్నతరం.. అయితే నేటితరం మాత్రం వైవాహిక జీవితాన్ని ఒక ఎగతాళిగా మార్చేశారు. ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే.. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా.. నూరేళ్ళు ఒకరికొకరు తోడుగా ఉండాలని భావించేవారు. కానీ ఇప్పుడున్న వారి ఆలోచన అలా లేదు.. ఆ వివరాలు..

Viral: మరీ ఇలా ఉన్నావ్.. ఇదేం కోరిక తల్లి.. ఆమె ఆశలు విన్నారంటే మగాళ్ల గుండెలు హడల్
Viral
Ravi Kiran
|

Updated on: Jun 13, 2024 | 11:51 AM

Share

పెళ్లి అనేది నూరేళ్ల పంట అని అనుకుంటుంది నిన్నతరం.. అయితే నేటితరం మాత్రం వైవాహిక జీవితాన్ని ఒక ఎగతాళిగా మార్చేశారు. ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే.. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా.. నూరేళ్ళు ఒకరికొకరు తోడుగా ఉండాలని భావించేవారు. కానీ ఇప్పుడున్న వారి ఆలోచన అలా లేదు.. పెళ్లి అనేది వారికొక ఎలిమెంట్.. జస్ట్ నచ్చితే కలిసున్నామా.. లేకపోతే విడాకులు తీసుకుని విడిపోయామా అన్నట్టు ఉంటుంది. ఇక ఇటీవల ఇలాంటి ఓ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

పెళ్లయిన 18 నెలలకే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ విడాకుల కోసం కోర్టుకెక్కింది. సాధారణంగా ఈతరం యువతీయువకులు చిన్న చిన్న కారణాలే విడాకులు తీసుకుంటున్నారు. ఇక ఈ మహిళ విడిపోవడానికి చెప్పిన కారణం విని.. న్యాయమూర్తి సైతం షాక్ అయ్యాడు. భర్త తనను అమితంగా ప్రేమిస్తున్నాడని, తనతో అస్సలు గొడవ పడడం లేదని ఆ మహిళ విడాకులు కోరింది. విడాకులు కోరిన సదరు మహిళ.. తనతో తన భర్త చాలా మాట్లాడాలని, వాదించాలని, గొడవపడాలని కోరుకుందట. అయితే ఆమె ఎంత చెప్పినా కూడా భర్త తనపై కోపం తెచ్చుకోవట్లేదని పేర్కొంది. ఒక్కరోజు కూడా ఆమెతో గొడవ పడలేదట. దీంతో విసిగి వేసారిన ఆ మహిళ తన భర్త ప్రేమ తనను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని విడాకులు కోరింది.

‘నా భర్త చాలా మంచివాడు. అతను నా కోసం వంట చేస్తాడు. ఇంటి పనులన్నీ చేయడంలో సహాయం చేస్తాడు. నన్ను అస్సలు ఇబ్బంది పెట్టడు. చాలా బాగా చూసుకుంటారు. ఇలా చేస్తూ.. ఆయన నన్ను తన ప్రేమలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. మేము ఇతర జంటల వలె మాములుగా లేమనిపిస్తోంది. నా భర్త నాతో ప్రతి విషయంలో రాజీపడడం నాకు ఇష్టం లేదు’ అని కోర్టులో ఆ మహిళ చెప్పింది. ‘నేను తప్పు చేసినప్పుడు అతను ఎల్లప్పుడూ నన్ను క్షమించేవాడు. ఎప్పుడూ ఏదొక గిఫ్ట్ నకు తీసుకొచ్చి.. నన్ను ఆశ్చర్యపరుస్తాడు. నేను అతనితో వాదించాలనుకున్నాను. కానీ, ఒక్కరోజు కూడా నాతో అతడు వాదించలేదు, గొడవ కూడా పడలేదు’ అని ఆమె పేర్కొంది. తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని చెప్పింది.

ఇక ఆమె వాదనలు విన్న జడ్జి.. విడాకుల పిటిషన్‌ను కొట్టిపారేశారు. ఇలాంటి నిరుపయోగమైన కారణాలకు విడాకులు మంజూరు చేయబోమని పేర్కొన్నారు. ‘మీ భర్తకు కూడా మీకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు. మీ సమస్యను మీరే పరిష్కరించుకోవాలి’ అని చెప్పారు. కాగా, ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది చదవండి: రూ. 6 కోట్లు పెట్టి బంగారు నగలు చేయించిన మహిళ.. తెల్లారి ఊహించని ట్విస్ట్

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..