AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: రూ. 6 కోట్లు పెట్టి బంగారు నగలు చేయించిన మహిళ.. తెల్లారి ఊహించని ట్విస్ట్

ఓ మహిళ ఎంతో ఇష్టంగా సుమారు రూ. 6 కోట్లతో బంగారు ఆభరణాలు చేయించుకుంది. ఆమెది అమెరికా అయితే.. ఇండియాకొచ్చి మరీ ఈ బంగారు నగలు చేయించింది. రాజస్తాన్ నుంచి ఆ నగలను ఆమె అమెరికాకు తీసుకెళ్లింది. ఓ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించింది. సీన్ కట్ చేస్తే..

Viral: రూ. 6 కోట్లు పెట్టి బంగారు నగలు చేయించిన మహిళ.. తెల్లారి ఊహించని ట్విస్ట్
Gold Representative Image
Ravi Kiran
|

Updated on: Jun 12, 2024 | 8:46 AM

Share

అమెరికాకు చెందిన చెరిష్ అనే మ‌హిళ జైపూర్‌లోని జోహ్రీ బజార్‌లో బంగారు దుకాణం య‌జ‌మాని నుంచి బంగారు పాలిష్‌తో కూడిన అభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేసింది. అయితే వాటికి అక్షరాలా 6 కోట్ల రూపాయలు వెచ్చించింది. విదేశీ మ‌హిళ‌ను ఆ న‌గ‌ల వ్యాపారి నిట్ట నిలువునా మోసం చేశాడు. నాణ్యమైన బంగారు న‌గ‌ల‌ పేరుతో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఆరు కోట్ల రూపాయ‌ల‌ దోపిడికి పాల్పడ్డాడు.

అమెరికాలో ఆ మహిళ ఓ ఎగ్జిబిష‌న్‌లో ఆ ఆభ‌ర‌ణాల‌ను ప్రదర్శించింది. ఈ క్రమంలో అవి న‌కిలీవ‌ని తేలింది. వాటి విలువ కేవ‌లం రూ. 300 మాత్రమేనని తెలిసి షాక్‌కు గురైంది. వెంట‌నే స‌ద‌రు మ‌హిళ జైపూర్‌కి వచ్చి షాప్ యజమాని గౌరవ్ సోనీని నిల‌దీసింది. దుకాణం యాజ‌మాని ఆమె ఆరోపణలను కొట్టిపారేసాడు. దీంతో చెరిష్.. జైపూర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అలాగే యూఎస్ ఎంబసీ అధికారుల నుంచి కూడా సహాయం కోరింది. స్పందించిన అధికారులు ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా జైపూర్ పోలీసులను కోరారు.

2022లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గౌరవ్ సోనీతో పరిచయం ఏర్పడిందని.. గత రెండేళ్లుగా ఆభరణాల కోసం రూ. 6 కోట్లు చెల్లించినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం గౌర‌వ్‌, అత‌ని తండ్రి రాజేంద్ర సోనీ ప‌రారీలో ఉండ‌గా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇది చదవండి: ఉన్నట్టుండి నిద్రపోతున్న చిన్నారి ఉయ్యాల పైకెక్కిన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత ఇది సీన్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..