బడిబాట కోసం ఇంటిబాట పట్టిన ఉపాధ్యాయులు.. ఎడ్లబండిలో..

బడిబాట కోసం ఇంటిబాట పట్టిన ఉపాధ్యాయులు.. ఎడ్లబండిలో..

Phani CH

|

Updated on: Jun 13, 2024 | 10:50 AM

బడి ఈడు పిల్లలను స్కూల్లో చేర్పించేందుకు రాష్ర్ట విద్యాశాఖ చేపట్టిన బడి బాట కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రణాళికను విడుదల చేసింది. ఈ ప్రణాళిక మేరకు వినూత్నంగా కార్యక్రమాలను చేపడుతూ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షిస్తున్నారు కొంత మంది ఉపాధ్యాయులు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం పెంచికల్ పేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఎడ్ల బండిపై ప్రచారాన్ని కొనసాగిస్తూ ఇంటింటికీ వెళుతున్నారు.

బడి ఈడు పిల్లలను స్కూల్లో చేర్పించేందుకు రాష్ర్ట విద్యాశాఖ చేపట్టిన బడి బాట కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రణాళికను విడుదల చేసింది. ఈ ప్రణాళిక మేరకు వినూత్నంగా కార్యక్రమాలను చేపడుతూ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షిస్తున్నారు కొంత మంది ఉపాధ్యాయులు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం పెంచికల్ పేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఎడ్ల బండిపై ప్రచారాన్ని కొనసాగిస్తూ ఇంటింటికీ వెళుతున్నారు. చిన్నారులను బడికి పంపేలా వారి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఎడ్లబండి పై ఉపాధ్యాయులు కూర్చుని ప్రధాన వీధుల గుండా ర్యాలీగా వెళ్తూ ప్రభుత్వ పాఠశాలలో చేరాలంటూ.. ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న వసతుల గురించి ప్రజలకు తెలుపుతూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాల వద్దు ప్రభుత్వ బడే ముద్దు అనే నినాదంతో ఐదేళ్లు నిండిన విద్యార్థుల ఇంటికి వెళ్లి పూలమాలతో సత్కరించి పాఠశాలల్లో ప్రవేశం కల్పించారు. ఉపాధ్యాయుల వినూత్న ప్రచారంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందేళ్లు ప్రేమను పంచిన అమ్మకు ఆత్మీయ సత్కారం

Vijay Thalapathy: మంచి మనసును చాటుకున్న విజయ్‌ దళపతి

బస్సులో ఎక్కిన ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు.. డ్రైవర్‌ ఏం చేశాడో తెలుసా ??

అంతరిక్ష కేంద్రంలో ‘సూపర్ బగ్’.. చిక్కుల్లో సునీతా విలియమ్స్

పేటీఎంలో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు.. ఎంత మందికి ఉద్వాసన పలికిందంటే ??