Vijay Thalapathy: మంచి మనసును చాటుకున్న విజయ్ దళపతి
కోలీవుడ్ హీరో దళపతి విజయ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల వెలువడిన టెన్త్, ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి బహుమతులు అందించనున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ ప్రతినిధులు ప్రకటించారు. గతేడాది ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న ఒక విద్యార్థినికి డైమండ్ నెక్లెస్ కానుకగా ఇచ్చారు విజయ్. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మంచి మార్కులు తెచ్చుకున్న వారికి ఆర్థిక సాయం చేశారు.
కోలీవుడ్ హీరో దళపతి విజయ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల వెలువడిన టెన్త్, ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి బహుమతులు అందించనున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ ప్రతినిధులు ప్రకటించారు. గతేడాది ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న ఒక విద్యార్థినికి డైమండ్ నెక్లెస్ కానుకగా ఇచ్చారు విజయ్. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మంచి మార్కులు తెచ్చుకున్న వారికి ఆర్థిక సాయం చేశారు. తాజాగా మరోసారి విద్యార్థులకు సాయం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాదిలో టాపర్లుగా నిలిచిన వారికి సర్టిఫికెట్‌తో పాటు రివార్డులను అందజేయనున్నారు. జూన్ 28, జులై 3తేదీల్లో చెన్నై వేదికగా సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. తమిళనాడులోని నియోజకవర్గాల వారీగా టెన్త్, ఇంటర్‌లో టాప్ 3లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించనున్నారు. ఇక ఇటీవలే విజయ్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించి రాజకీయ ప్రవేశం చేశారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం విజయ్ ‘ది గోట్’ తో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఇది తెరకెక్కనుంది. ఈ చిత్రంలో విజయ్ కోసం ప్రత్యేకంగా ‘డీ-ఏజింగ్ టెక్నాలజీ’ వాడారు. ఈ టెక్నాలజీతో ఆయన్ని పాతికేళ్ల కుర్రాడిలా చూపించనున్నారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బస్సులో ఎక్కిన ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు.. డ్రైవర్ ఏం చేశాడో తెలుసా ??
అంతరిక్ష కేంద్రంలో ‘సూపర్ బగ్’.. చిక్కుల్లో సునీతా విలియమ్స్
పేటీఎంలో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు.. ఎంత మందికి ఉద్వాసన పలికిందంటే ??
రిలీజ్ అయిన 20 రోజుల్లోనే OTTలోకి విశ్వక్.. GOG వైపే అందరి చూపు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

