అంతరిక్ష కేంద్రంలో ‘సూపర్ బగ్’.. చిక్కుల్లో సునీతా విలియమ్స్

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు.. బారీ యూజీన్ వ్యోమగామి ఇద్దరూ జూన్ 6న అంతర్జాతీయ అంతరక్ష కేంద్రానికి వెళ్లారు. మిగతా ఏడుగురు సిబ్బంది చాలా కాలంగా అక్కడే ఉన్నారు. 'ఎంటర్‌బాక్టర్ బుగాన్‌డెన్సిస్’ అనే బ్యాక్టీరియా కారణంగా ఇప్పుడు వీరంతా చిక్కుల్లో పడ్డారు. సూపర్‌ బగ్‌గా పిలిచే ఈ బ్యాక్టీరియా మూసి ఉండే వాతావరణంలో పెరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

అంతరిక్ష కేంద్రంలో ‘సూపర్ బగ్’.. చిక్కుల్లో సునీతా విలియమ్స్

|

Updated on: Jun 13, 2024 | 10:44 AM

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు.. బారీ యూజీన్ వ్యోమగామి ఇద్దరూ జూన్ 6న అంతర్జాతీయ అంతరక్ష కేంద్రానికి వెళ్లారు. మిగతా ఏడుగురు సిబ్బంది చాలా కాలంగా అక్కడే ఉన్నారు. ‘ఎంటర్‌బాక్టర్ బుగాన్‌డెన్సిస్’ అనే బ్యాక్టీరియా కారణంగా ఇప్పుడు వీరంతా చిక్కుల్లో పడ్డారు. సూపర్‌ బగ్‌గా పిలిచే ఈ బ్యాక్టీరియా మూసి ఉండే వాతావరణంలో పెరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ కావడంతో దీనిని ‘సూపర్ బగ్’ అని పిలుస్తుంటారని, శ్వాసకోశ వ్యవస్థపై ఈ బ్యాక్టీరియా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు అన్నారు. ఈ ‘స్పేస్ బగ్స్‘ గ్రహాంతరాలకు సంబంధించినవి కావని, వ్యోమగాముల ద్వారా భూమి నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరి ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతరిక్ష కేంద్రంలో పనిచేసే వ్యోమగాములు ప్రత్యేక పరిస్థితుల్లో పని చేస్తుంటారు. అంతరిక్ష యాత్రల సమయంలో ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటారని పరిశోధకులు చెప్పారు. సంప్రదాయ వైద్య సదుపాయాలకు దూరంగా ఉంటారు కాబట్టి.. వ్యోమగాముల ఆరోగ్యంపై సూక్ష్మజీవుల ప్రభావాన్ని అంచనా వేసే పరిశోధనలు జరుపుతున్నారు. కాలిఫోర్నియాలోని పసాదేనా కేంద్రంగా పనిచేస్తున్న నాసా ‘జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ’కి చెందిన డాక్టర్ కస్తూరి వెంకటేశ్వరన్ సారథ్యంలో ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. వెంకటేశ్వరన్ నాసాలో చేరడానికి ముందు చెన్నైలోని అన్నామలై విశ్వవిద్యాలయంలో మెరైన్ మైక్రోబయాలజీ చదివారు. 2023లో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీదుగా ‘కలామిల్లా పియర్సోని’ అనే కొత్త మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ బగ్‌ని ఆయన కనుగొన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పేటీఎంలో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు.. ఎంత మందికి ఉద్వాసన పలికిందంటే ??

TOP 9 ET News: ‘నా తమ్ముడు డిప్యూటీ సీఎం’ చిరు ట్వీట్ | క్లీంకార పుట్టిన వేళావిశేషం మెగా కుటుంబానికి పట్టిన అదృష్టం

రిలీజ్‌ అయిన 20 రోజుల్లోనే OTTలోకి విశ్వక్.. GOG వైపే అందరి చూపు

అంచనాలు తలకిందులు చేస్తూ.. OTTలోకి కార్తికేయ సినిమా

Follow us
Latest Articles