యాపిల్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఇదిగో.. అదిరిపోయే ఫీచర్లు ఇవే
ఐఫోన్ ప్రియులకు ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది అమెరికాలోని సంస్థ. నెక్స్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘ఐవోఎస్ 18’ని యాపిల్ కంపెనీ ఆవిష్కరించింది. సోమవారం జరిగిన కంపెనీ ‘వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024’లో దీనిని విడుదల చేసింది. ఈ కొత్త ఐవోఎస్‌లో పలు ఆకర్షణీయమైన నూతన ఫీచర్లు ఉన్నాయి. హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్, కంట్రోల్ సెంటర్ రీవాంప్, మెసేజ్ ల యాప్‌కి అప్‌డేట్స్, ట్యాప్ టు క్యాష్‌తో పాటు ఇతర ఫీచర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
ఐఫోన్ ప్రియులకు ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది అమెరికాలోని సంస్థ. నెక్స్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘ఐవోఎస్ 18’ని యాపిల్ కంపెనీ ఆవిష్కరించింది. సోమవారం జరిగిన కంపెనీ ‘వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024’లో దీనిని విడుదల చేసింది. ఈ కొత్త ఐవోఎస్‌లో పలు ఆకర్షణీయమైన నూతన ఫీచర్లు ఉన్నాయి. హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్, కంట్రోల్ సెంటర్ రీవాంప్, మెసేజ్ ల యాప్‌కి అప్‌డేట్స్, ట్యాప్ టు క్యాష్‌తో పాటు ఇతర ఫీచర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఐవోఎస్ 18 ద్వారా యాపిల్ కొన్ని అదిరిపోయే ఫీచర్లు అందించింది. థీమింగ్స్ ఆప్షన్ల ద్వారా యాప్ ఐకాన్‌లను హోం స్క్రీన్‌పై నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. డార్క్ మోడ్‌లో యూజర్లు తమకు నచ్చిన విధంగా యాప్‌లను మార్చుకోవచ్చు. ఇక మల్టీపుల్ లేఅవుట్లు చేసుకునేందుకు వీలుగా కంట్రోల్ సెంటర్ ఫీచర్ అప్‌డేట్‌ను యాపిల్ అందించింది. కంట్రోల్ సెంటర్‌కు అవసరమైన విభిన్న లేఅవుట్ విడ్జెట్ల కోసం థర్డ్ పార్టీ డెవలపర్స్ అనుమతి కూడా ఉంటుంది. ఇక ఫ్లాష్‌లైట్, కెమెరా ఐకాన్లను లాక్ స్క్రీన్‌పైకి తీసుకోవచ్చు. ఐవోఎస్ 18పై మరో ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే.. పర్సనల్ యాప్‌లను ఫేస్ ఐడీతో లాక్ చేసుకోవచ్చు. మెసేజెస్ యాప్‌లో ఏదైనా ఒక ఎమోజీ లేదా స్టిక్కర్‌ను తిరిగి ట్యాప్ చేసుకునేలా ట్యాప్‌బ్యాక్‌లను రీడిజైన్ చేసింది. అంతేకాదు మెసేజులను షెడ్యూల్ చేసి పంపించవచ్చు. అండర్‌లైన్ వంటి టెక్స్ట్ ఎఫెక్ట్‌లు, ఫార్మాటింగ్ ఆప్షన్లు కూడా కొత్త ఐవోఎస్‌లో ఉన్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బడిబాట కోసం ఇంటిబాట పట్టిన ఉపాధ్యాయులు.. ఎడ్లబండిలో..
వందేళ్లు ప్రేమను పంచిన అమ్మకు ఆత్మీయ సత్కారం
Vijay Thalapathy: మంచి మనసును చాటుకున్న విజయ్ దళపతి
బస్సులో ఎక్కిన ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు.. డ్రైవర్ ఏం చేశాడో తెలుసా ??
అంతరిక్ష కేంద్రంలో ‘సూపర్ బగ్’.. చిక్కుల్లో సునీతా విలియమ్స్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

