Nokia 3210 4G: 25 ఏళ్ల తర్వాత నోకియా రీ ఎంట్రీ.. నోకియా 3210 ఫీచర్లు ఇవే.!
నోకియా బ్రాండ్‌పై ఫోన్లు తయారుచేసే హెఎండీ గ్లోబల్ సంస్థ.. Nokia 3210 4G ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 25 ఏళ్ల క్రితం లాంచ్ అయిన ఈ మోడల్ మరోసారి నోకియా ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్ ధరను 3,999 రూపాయలుగా నిర్ణయించారు. అమెజాన్, హెచ్‌ఎండీ ఈ స్టోర్ వెబ్‌సైట్లలో కొనుగోలు చేయొచ్చు. మరోసారి అదే రెట్రో లుక్‌ను కొనసాగించారు. నీలం, పసుపు, నలుపు రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
నోకియా బ్రాండ్‌పై ఫోన్లు తయారుచేసే హెఎండీ గ్లోబల్ సంస్థ.. Nokia 3210 4G ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 25 ఏళ్ల క్రితం లాంచ్ అయిన ఈ మోడల్ మరోసారి నోకియా ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్ ధరను 3,999 రూపాయలుగా నిర్ణయించారు. అమెజాన్, హెచ్‌ఎండీ ఈ స్టోర్ వెబ్‌సైట్లలో కొనుగోలు చేయొచ్చు. మరోసారి అదే రెట్రో లుక్‌ను కొనసాగించారు. నీలం, పసుపు, నలుపు రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే. ఇందులో 2.4 అంగుళాల QVGA డిస్‌ప్లే ఉంటుంది. యునిసోక్ టీ107 ప్రాసెసర్ ను అమర్చారు. వెనక వైపు 2 ఎంపీ కెమెరా అమర్చారు. 64 ఎంబీ ర్యామ్ ఇచ్చారు. యూట్యూబ్, యూట్యూబ్ షార్ట్స్, న్యూస్, గేమ్స్ కోసం వేర్వేరుగా యాప్స్ ఇచ్చారు. స్నేక్ గేమ్‌ను కొనసాగించారు. ఈ ఫోన్‌లో 1450 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. యూఎస్‌బీ టైప్-సి పోర్టుతో వస్తుండడం గమనార్హం. 3.5 ఎంఎం జాక్, ఎంపీ3 ప్లేయర్, ఎఫ్‌ఎం రేడియో, డ్యూయల్ సిమ్ 4జీ voLTE సపోర్ట్‌తో ఈ ఫోన్ వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.