సౌర తుపానుల‌ను చిత్రీక‌రించిన ఆదిత్య L1.. ఫోటోలు విడుదల చేసిన ఇస్రో

సూర్యుడిపై అధ్యయ‌నం కోసం ఆదిత్య -L1 స్పేస్‌క్రాఫ్ట్‌ను ఇస్రో నింగిలోకి పంపింది. ఆ వ్యోమ‌నౌక‌లో ఉన్న రెండు రిమోట్ సెన్సింగ్ ప‌రికరాలు.. సూర్యుడి ప్రకోపాన్ని చిత్రీక‌రించాయి. ఈ విష‌యాన్ని ఇస్రో సోమవారం వెల్లడించింది. త‌న ఎక్స్‌ ఖాతాలో ఇస్రో సూర్యుడికి చెందిన ఫోటోల‌ను రిలీజ్ చేసింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి ఆరో తేదీన ఆదిత్య ఎల్‌1 .. లాగ్రాంగియ‌న్ పాయింట్‌కు చేరుకుంది. భూమికి సుమారు 1.5 మిలియ‌న్ల కిలోమీట‌ర్ల దూరంలో ప్రస్తుతం ఆదిత్య ఎల్‌1 ఉంది.

సౌర తుపానుల‌ను చిత్రీక‌రించిన ఆదిత్య L1.. ఫోటోలు విడుదల చేసిన ఇస్రో

|

Updated on: Jun 12, 2024 | 11:51 AM

సూర్యుడిపై అధ్యయ‌నం కోసం ఆదిత్య -L1 స్పేస్‌క్రాఫ్ట్‌ను ఇస్రో నింగిలోకి పంపింది. ఆ వ్యోమ‌నౌక‌లో ఉన్న రెండు రిమోట్ సెన్సింగ్ ప‌రికరాలు.. సూర్యుడి ప్రకోపాన్ని చిత్రీక‌రించాయి. ఈ విష‌యాన్ని ఇస్రో సోమవారం వెల్లడించింది. త‌న ఎక్స్‌ ఖాతాలో ఇస్రో సూర్యుడికి చెందిన ఫోటోల‌ను రిలీజ్ చేసింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి ఆరో తేదీన ఆదిత్య ఎల్‌1 .. లాగ్రాంగియ‌న్ పాయింట్‌కు చేరుకుంది. భూమికి సుమారు 1.5 మిలియ‌న్ల కిలోమీట‌ర్ల దూరంలో ప్రస్తుతం ఆదిత్య ఎల్‌1 ఉంది. అక్కడి నుంచే సూర్యుడిని ఆ స్పేస్‌క్రాఫ్ట్ అధ్యయ‌నం చేస్తోంది. సోలార్ ఆల్ట్రా వాయిలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ , విజిబుల్ ఎమిష‌న్ లైన్ క‌రోనాగ్రాఫ్‌ ప‌రిక‌రాలు.. సూర్యుడిలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ప‌సికట్టాయి. మే నెల‌లో ఆ చిత్రాల‌ను తీసిన‌ట్లు ఇస్రో త‌న ప్రక‌ట‌న‌లో తెలిపింది. క‌రోన‌ల్ మాస్ ఎజెక్సన్స్‌తో లింకున్న X-క్లాస్‌, M-క్లాస్ జ్వాల‌లను రికార్డు చేసిన‌ట్లు ఇస్రో వెల్లడించింది. సూర్యుడిలోని AR 13664 ప్రాంతం యాక్టివ్‌గా ఉంద‌ని, అక్కడ మే 8 నుంచి 15వ తారీఖు మ‌ధ్య X-క్లాస్‌, M-క్లాస్ జ్వాల‌లు ఉత్పన్నం అయిన‌ట్లు గుర్తించారు. వీటి వ‌ల్లే మే 11వ తేదీన‌ జియోమాగ్నటిక్ స్ట్రార్మ్ వెలుబ‌డిన‌ట్లు ఆ ప్రక‌ట‌న‌లో పేర్కొన్నారు. మే 17వ తేదీన SUIT తీసిన సూర్యుడి చిత్రాల‌ను ఇస్రో రిలీజ్ చేసింది. అంతేకాకుండా VELC సూచించిన వివ‌రాల‌ను కూడా ఇస్రో వివరించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అకస్మాత్తుగా లేచి కూర్చున్న శవం.. అవాక్కైన స్థానికులు, పోలీసులు

బిగ్ బాస్‌8లోకి బ్యూటిఫుల్ పాపలు.. ఈ సారి ఇక రచ్చో రచ్చ

ఆ సర్జరీ చేయించుకోమని.. నన్ను మానసికంగా వేధించేవారు

‘మాజీ ప్రియురాలికి హృతిక్ మద్దతు’.. ఎక్కడో తేడా కొడుతుంది బుజ్జీ

TOP 9 ET News: హిస్టారికల్ రికార్డ్‌ వైపు ప్రభాస్ కల్కి!|ఏపీ CM ప్రమాణస్వీకారానికి స్టేట్ గెస్ట్‌గా చిరంజీవి

Follow us