Noor Malabika Das: పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో నటి మృతదేహం.! వీడియో వైరల్..

Noor Malabika Das: పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో నటి మృతదేహం.! వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Jun 13, 2024 | 3:31 PM

బాలీవుడ్ నటి నూర్‌ మాలబికా దాస్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె ఉంటున్న ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంకు చెందిన నూర్‌ మాలబికా దాస్‌.. కెరియర్‌ దృష్ట్యా ముంబయిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దిగారు. ఈ క్రమంలోనే ఆమె ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడాన్ని ఇరుగుపొరుగు వారు గుర్తించి, అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు.

బాలీవుడ్ నటి నూర్‌ మాలబికా దాస్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె ఉంటున్న ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంకు చెందిన నూర్‌ మాలబికా దాస్‌.. కెరియర్‌ దృష్ట్యా ముంబయిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దిగారు. ఈ క్రమంలోనే ఆమె ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడాన్ని ఇరుగుపొరుగు వారు గుర్తించి, అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన పోలీసులు తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా, ఆమె మృతదేహం పూర్తిగా కుళ్లిపోయే స్థితికి చేరింది. నూర్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్య దశలో ఉన్న ఆమె తల్లిదండ్రులు.. ఇటీవలే ముంబయికి వచ్చి వెళ్లారు.

కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు మళ్లీ రాలేమంటూ సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె స్నేహితుడు, నటుడు అలోక్‌నాథ్‌ పాఠక్‌ ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. నూర్‌ మాలబికా దాస్‌ గతంలో ఖతర్‌ ఎయిర్‌వేస్‌లో ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేశారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ముంబయికి వచ్చారు. బాలీవుడ్‌ ప్రముఖ నటి కాజోల్‌ నటించిన ‘ది ట్రయల్‌’ సిరీస్‌తో పాటు పలు వెబ్‌ షోల్లో నటించారు. నూర్‌ మృతిపై ‘ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌’ విచారం వ్యక్తం చేసింది. మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కోరింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.