Viral Video: ధైర్యముంటేనే చూడండి.. నడిరోడ్డుపై నాగుపాముల సయ్యాట.. చూస్తే షాకే..

సాధారణంగా పాములంటే అందరికీ భయమే. కొందరు పాము పేరు చెబితేనే భయంతో వణికిపోతారు. అలాంటిది రెండు పాములు జంటగా కనిపిస్తే అవికూడా నాగిని డాన్స్‌ చేస్తూ తన్మయత్వంలో ఉండగా చూస్తే.. మొదటిసారి చూసేవారైతే ఒక్క ఉదుటన పరుగు లంకించుకుంటారు.. గతంలో కూడా..

Viral Video: ధైర్యముంటేనే చూడండి.. నడిరోడ్డుపై నాగుపాముల సయ్యాట.. చూస్తే షాకే..
Snakes
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 14, 2024 | 1:30 PM

సాధారణంగా పాములంటే అందరికీ భయమే. కొందరు పాము పేరు చెబితేనే భయంతో వణికిపోతారు. అలాంటిది రెండు పాములు జంటగా కనిపిస్తే అవికూడా నాగిని డాన్స్‌ చేస్తూ తన్మయత్వంలో ఉండగా చూస్తే.. మొదటిసారి చూసేవారైతే ఒక్క ఉదుటన పరుగు లంకించుకుంటారు.. గతంలో కూడా అలాంటి దృశ్యాన్ని చూసినవారైతే అందరినీ పిలుస్తారు.. ఇటీవల అందరి చేతుల్లో మొబైల్స్‌ ఉంటున్నాయి కాబట్టి ఆ అరుదైన దృశ్యాన్ని వెంటనే తమ మొబైల్స్‌లో బంధించి వెంటనే నెట్టింట పోస్ట్‌ చేస్తారు. తాజాగా అదే జరిగింది. నాగుపాములు సయ్యాట దృశ్యం ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక BSNL టెలిఫోన్ ఎక్స్చేంజ్ సమీపంలో జెర్రిపోతు, నాగుపాము పెనవేసుకుని చూపరులను కట్టిపడేశాయి. సుమారు గంటపాటు పెనవేసుకున్న సర్పాలు పరస్పరం తమ ప్రేమను చాటుకున్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు దానిని మొబైల్‌ లో రికార్డ్ చేసి నెట్టింట పోస్ట్‌ చేశారు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఇది చదవండి: మరీ ఇలా ఉన్నావ్.. ఇదేం కోరిక తల్లి.. ఆమె ఆశలు విన్నారంటే మగాళ్ల గుండెలు హడల్

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి