AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఓరీ దేవుడో ఏనుగు ఇల్లేక్కుతుందా..! ఇంకేమైన ఉందా..? వీడియో చూస్తే మాత్రం మెచ్చుకుంటారు..!!

ఏనుగులు, ఎలుగుబంట్లు జాక్‌ఫ్రూట్‌ను చాలా ఇష్టపడతాయి. మీరు అడవికి సమీపంలోని ప్రాంతంలో నివసిస్తుంటే, మీ ఇంటి దగ్గర పనసపండు చెట్లు ఉంటే, ఆహ్వానం లేని అతిథులు ఖచ్చితంగా వస్తారని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ పోస్ట్‌కు 13 వేలకు పైగా వీక్షణలు, ఐదు వందలకు పైగా లైక్‌లు వచ్చాయి.

Watch: ఓరీ దేవుడో ఏనుగు ఇల్లేక్కుతుందా..! ఇంకేమైన ఉందా..? వీడియో చూస్తే మాత్రం మెచ్చుకుంటారు..!!
Elephant
Jyothi Gadda
|

Updated on: Jun 14, 2024 | 9:14 PM

Share

ఏనుగులు చాలా తెలివైనవి జంతువులుగా చెబుతారు. దాని భారీ శరీరం, బలం పరంగా చూస్తే అడవికి రాజు అని చెప్పాల్సిందే. కొన్ని సార్లు ఈ జంతువు బలాన్ని మాత్రమే కాదు.. దాని మెదడును కూడా ఉపయోగిస్తుంది. ఏనుగు తన తెలివితో తనకు కావాల్సినది దక్కించుకుంటుంది. సోషల్ మీడియాలో గజరాజుల తెలివికి సంబంధించిన చాలా వీడియోలను చూసి ఉంటారు. తాజా వీడియో కూడా అలాంటిదే. ఏనుగులు తమకు నచ్చినదాన్ని పొందడానికి ఎలాంటి పనినైనా చేస్తాయి అనేందుకు ఇది ఒక అందమైన ఉదాహరణ. ఇక్కడో ఏనుగు చేసిన పనికి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

వైరల్‌ వీడియోలో ఒక ఏనుగు జనావాసాల్లో సంచరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే, దానికి ఒక పనస చెట్టు కనిపించింది. చెట్టుపై ఉన్న పండు తినాలని ఆశపడింది ఆ ఏనుగు. ఏనుగు ఆ చెట్టును ఎక్కలేదు. అందుకని చెట్టును ధ్వంసం చేయకుండా పండు కోసుకోవాలని ఆలోచించింది. అప్పుడు అది నెమ్మదిగా ఆ చెట్టు దగ్గరకు వెళ్లింది. ఆ పక్కనే ఉన్న ఇంటి పైకప్పు మీద రెండు కాళ్లను పెట్టి తన వాటాగా పనస పండ్లను తెంపుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.. అయితే, ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడిది అనేది మాత్రం తెలియలేదు. కానీ, ఏనుగు చేసిన పనికి నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో జూన్ 14 న Instagram హ్యాండిల్ @wildtrails.in నుండి పోస్ట్ చేయబడింది. అతను క్యాప్షన్‌లో రాశాడు – ఏనుగులు, ఎలుగుబంట్లు జాక్‌ఫ్రూట్‌ను చాలా ఇష్టపడతాయి. మీరు అడవికి సమీపంలోని ప్రాంతంలో నివసిస్తుంటే, మీ ఇంటి దగ్గర పనసపండు చెట్లు ఉంటే, ఆహ్వానం లేని అతిథులు ఖచ్చితంగా వస్తారని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ పోస్ట్‌కు 13 వేలకు పైగా వీక్షణలు, ఐదు వందలకు పైగా లైక్‌లు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..