పాము కూర వండుకుని తిన్న తమిళనాడు వ్యక్తి జైలుపాలు

పాము కూర వండుకుని తిన్న తమిళనాడు వ్యక్తి జైలుపాలు

Phani CH

|

Updated on: Jun 14, 2024 | 10:49 PM

పాము చర్మం ఒలిచి, కూర వండుకుని తిన్న యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. పాము చర్మాన్ని ఒలుస్తున్న వీడియో వైరల్ అవ్వడం వల్ల రంగంలోకి దిగిన పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. తిరుపత్తూరు జిల్లాలోని పెరుమపట్టు ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల రాజేశ్​ కుమార్ పాము చర్మాన్ని ఒలుస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది.

పాము చర్మం ఒలిచి, కూర వండుకుని తిన్న యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. పాము చర్మాన్ని ఒలుస్తున్న వీడియో వైరల్ అవ్వడం వల్ల రంగంలోకి దిగిన పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. తిరుపత్తూరు జిల్లాలోని పెరుమపట్టు ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల రాజేశ్​ కుమార్ పాము చర్మాన్ని ఒలుస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. దీంతో జిల్లా అటవీశాఖ అధికారి మహేంద్రన్ ఆ వీడియాపై విచారణకు ఆదేశించారు. వీడియో ద్వారా రాజేశ్​ను గుర్తించిన స్థానిక అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా రాజేశ్​ పాము చర్మాన్ని ఒలిచి, కూర వండుకుని కూడా తిన్నట్లు తేలింది. దీంతో వన్య జంతు సంరక్షణ చట్టం కింద అతడిని అరెస్టు చేసి తిరుపత్తూరు కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత జైలుకు తరలించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాభిమానినే హత్య చేయించిన హీరో.. వెలుగులోకి సంచలన నిజాలు