Viral: నిండు గర్భిణికి రైలు టాయిలెట్‌లో డెలివరీ.. బిడ్డకు రైలు పేరు.
మహారాష్ట్రలో ఓ విచిత్ర ఘటన జరిగింది. నిండు గర్భిణిగా ఉన్న ఓ ముస్లిం మహిళ ఊహించని రీతిలో రైలులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇతర మహిళా ప్రయాణికులు ఆమెకు పురుడు పోశారు. రైలులో తనకు పుట్టిన బిడ్డకు ఆ తల్లి ఆ రైలు పేరే పెట్టింది. ఇకపై తన బిడ్డను ఆ రైలు పేరుతోనే పిలుచుకుంటానని తెలిపింది. ఉదయం కొల్హాపూర్-ముంబై మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న గర్భిణి ఫాతిమా ఖాతూన్ కు పురిటి నొప్పులు మొదలయ్యాయి.
మహారాష్ట్రలో ఓ విచిత్ర ఘటన జరిగింది. నిండు గర్భిణిగా ఉన్న ఓ ముస్లిం మహిళ ఊహించని రీతిలో రైలులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇతర మహిళా ప్రయాణికులు ఆమెకు పురుడు పోశారు. రైలులో తనకు పుట్టిన బిడ్డకు ఆ తల్లి ఆ రైలు పేరే పెట్టింది. ఇకపై తన బిడ్డను ఆ రైలు పేరుతోనే పిలుచుకుంటానని తెలిపింది. కొల్హాపూర్-ముంబై మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న గర్భిణి ఫాతిమా ఖాతూన్ కు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని ఆమె రైలు లోనావాలా స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో భర్త తయ్యబ్‌కు తెలిపింది. తయ్యబ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫాతిమాకు వాంతులు అవుతుండటంతో ఆమె రైలులోని టాయిలెట్‌కు వెళ్లింది. ఎంతసేపటికీ ఫాతిమా తిరిగి రాలేదు. దీంతో తయ్యబ్ టాయిలెట్‌లోకి వెళ్లి చూశాడు. ఫాతిమా ఆడబిడ్డకు జన్మనిచ్చిందని గుర్తించాడు. రైలులో ఉన్న ఇతర మహిళా ప్రయాణికులకు ఈ సంగతి తెలిపాడు. దీంతో వారు ఫాతిమాకు సహాయం అందించారు. ఈ విషయాన్ని తయ్యబ్ రైల్వే పోలీసులకు తెలియజేశాడు. రైలు లోనావాలా స్టేషన్‌కు చేరుకోగానే అక్కడి రైల్వే సిబ్బంది ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తల్లీబిడ్డకు చికిత్స అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి కుదుటపడ్డాక వారిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

