అంత్యక్రియలు జరిగిన 13 రోజుల తర్వాత.. ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తి

చనిపోయి, అంత్యక్రియలు కూడా నిర్వహించిన తర్వాత కొన్ని రోజులకు ఆ వ్యక్తి ... తన ఇంటి ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది.. ఒక్కసారి ఊహించుకోండి.. ఊహ కాదు నిజంగానే జరిగింది. రోడ్డు ప్రమాదానికిగి గురైన వ్యక్తిని గుర్తించిన అతడి కుటుంబం.. ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే పెద్ద కర్మ ముందు రోజు ఆ వ్యక్తి తన కుటుంబానికి ఫోన్‌ చేశాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు బతికే ఉన్నాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు షాక్‌ అయ్యారు.

అంత్యక్రియలు జరిగిన 13 రోజుల తర్వాత.. ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తి

|

Updated on: Jun 14, 2024 | 10:52 PM

చనిపోయి, అంత్యక్రియలు కూడా నిర్వహించిన తర్వాత కొన్ని రోజులకు ఆ వ్యక్తి … తన ఇంటి ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది.. ఒక్కసారి ఊహించుకోండి.. ఊహ కాదు నిజంగానే జరిగింది. రోడ్డు ప్రమాదానికిగి గురైన వ్యక్తిని గుర్తించిన అతడి కుటుంబం.. ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే పెద్ద కర్మ ముందు రోజు ఆ వ్యక్తి తన కుటుంబానికి ఫోన్‌ చేశాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు బతికే ఉన్నాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు షాక్‌ అయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌ జిల్లా లహచోరా గ్రామానికి చెందిన సురేంద్ర శర్మ, రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని క్లాత్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ సమీపంలోని సుర్వాల్‌లో గత నెలలో రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని గుర్తించాలని కోరుతూ సామాజిక కార్యకర్త ఒక ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఆ వ్యక్తిని సురేంద్రగా అతడి కుటుంబ సభ్యులు గుర్తించారు. జైపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. దీంతో రాజస్థాన్‌ పోలీసులు పోస్ట్‌మార్టం తర్వాత ఆ వ్యక్తి మృతదేహాన్ని సురేంద్ర కుటుంబానికి అప్పగించారు. మే 28న అంత్యక్రియలు నిర్వహించారు. 13వ రోజున సురేంద్రకు దశ దిన కర్మలు చేసేందుకు అతడి కుటుంబం సిద్ధమైంది. అయితే ముందు రోజు సురేంద్ర నుంచి ఫోన్‌ వచ్చింది. తాను బతికే ఉన్నానని చెప్పాడు. ఆ విషయం నమ్మని సురేంద్ర సోదరుడు వీడియో కాల్‌ చేయాలని కోరాడు. అతడు వీడియో కాల్‌ చేయగా సురేంద్ర బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలుసుకుని షాక్‌ అయ్యారు. వెంటనే ఇంటికి తిరిగి రావాలని చెప్పారు. అలాగే 13వ రోజున నిర్వహించాల్సిన కర్మకాండలను వాయిదా వేశారు. ఇంటికి తిరిగి వచ్చిన సురేంద్ర తన ఫోన్‌ పాడైందని తెలిపాడు. అందుకే రెండు నెలలుగా కుటుంబానికి ఫోన్‌ చేయలేదని చెప్పాడు. అయితే అతడు బతికే ఉన్నాడని రాజస్థాన్‌ పోలీసులకు తెలిసింది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తప్పుగా గుర్తించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన సురేంద్ర కుటుంబం నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గృహజ్యోతి పథకంలో రూ.లక్షల్లో కరెంట్‌ బిల్లు

పాము కూర వండుకుని తిన్న తమిళనాడు వ్యక్తి జైలుపాలు

రాభిమానినే హత్య చేయించిన హీరో.. వెలుగులోకి సంచలన నిజాలు

Follow us