AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగని ఆర్టీసీ బస్సు.. ఆటోతో వెంబడించి మరీ మహిళ వీరంగం

ఆగని ఆర్టీసీ బస్సు.. ఆటోతో వెంబడించి మరీ మహిళ వీరంగం

Phani CH
|

Updated on: Jun 14, 2024 | 10:58 PM

Share

ఆర్టీసీ బస్సును ఎక్కే వరకు ఆపకుండా వెళ్లిపోవడంపై ఓ మహిళా ప్రయాణికురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో ద్వారా వెంబడించి మరీ బస్సుకు అడ్డంగా ఆటోను ఆపి ఆందోళనకు దిగారు. ఈ ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. నెక్కొండ మండలం పత్తిపాక గ్రామానికి చెందిన చాగంటి మంజుల తన ముగ్గురు పిల్లలతో కలసి జగిత్యాల జిల్లా కొండగట్టులో ఉంటున్నారు. బుధవారం పిల్లలతో కలిసి వరంగల్ వచ్చారు. వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ వెళ్ళడానికి తన ముగ్గురు పిల్లలతో కలిసి వేచి చూస్తున్నారు.

ఆర్టీసీ బస్సును ఎక్కే వరకు ఆపకుండా వెళ్లిపోవడంపై ఓ మహిళా ప్రయాణికురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో ద్వారా వెంబడించి మరీ బస్సుకు అడ్డంగా ఆటోను ఆపి ఆందోళనకు దిగారు. ఈ ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. నెక్కొండ మండలం పత్తిపాక గ్రామానికి చెందిన చాగంటి మంజుల తన ముగ్గురు పిల్లలతో కలసి జగిత్యాల జిల్లా కొండగట్టులో ఉంటున్నారు. బుధవారం పిల్లలతో కలిసి వరంగల్ వచ్చారు. వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ వెళ్ళడానికి తన ముగ్గురు పిల్లలతో కలిసి వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో నెక్కొండ- మహబూబాబాద్‎ వెళ్లే ఆర్టీసీ బస్సు వచ్చింది. ఆ బస్సులో తన ఇద్దరు కూతుళ్లను సామగ్రితో సహా ఎక్కించారు. దివ్యాంగుడైన తన కుమారుడిని లోపలికి ఎక్కించడానికి బస్సు కండక్టర్ నిరాకరించాడు. అప్పటికే బస్సు నిండిపోయి.. ఒకరినొకరు తోసుకునే పరిస్థితి రావడంతో దివ్యాంగుడైన తన కుమారుడిని ఎక్కించడానికి ‘బస్సులో ఖాళీ లేదు.. మరో బస్సులో రావాలని’ కండక్టర్ సూచించారు. అప్పటికే తన ఇద్దరు కుమార్తెలు బస్సులో ఉన్నారన్న విషయం తెలియని డ్రైవర్.. కండక్టర్ సూచన మేరకు ముందుకు పోనిచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళా ప్రయాణికురాలు కొంతదూరం బస్సు వెనకాల పరుగెత్తారు. చివరకు ఓ ఆటో తీసుకొని వెళ్లి శివనగర్ అండర్ బ్రిడ్జి వద్ద బస్సును అడ్డగించారు. నడి రోడ్డుపై శివమెత్తిన మహిళ తన ప్రతాపం చూపించారు. బస్సు ఎందుకు ఆపలేదని బస్సుకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. తన ఇద్దరు పిల్లలు బస్సులో ఉండగా, దివ్యాంగుడైన కుమారుడిని ఎక్కించుకోకుండా ఎలా వెళతారని బస్సు డ్రైవర్, కండక్టర్లపై అగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు అరగంటకుపైగా బస్సు ముందుకు కదలకుండా అడ్డుకోవడంతో.. ప్రయాణికులు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మీ కుమారుడిని ఆటోలో నుంచి తీసుకొచ్చి బస్సు ఎక్కిస్తే కలిసి వెళ్దామని చెప్పినా.. అందుకు ఆమె అంగీకరించలేదు. ఆటో ఛార్జీలు ఎవరిస్తారని ప్రశ్నించి పట్ట పగలే చుక్కలు చూపించింది. బస్సును తిరిగి బస్టాండ్‎కు తీసుకెళ్లి.. తన కుమారుడిని ఎక్కించుకొని రావాలని పట్టుబట్టింది. ఈలోగా ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళా ప్రయాణికురాలిని పక్కకు తీసుకెళ్లి శాంతింపజేశారు. బస్టాండ్‎లో ఉన్న దివ్యాంగుడిని ఎక్కించి ఆగిన బస్సును పంపించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్లూకోజ్ వాటర్‌ తెగ తాగేస్తున్నారా ?? ఎవరు, ఎప్పుడు, ఎంత తాగవచ్చు ??

కోర్టుకు వెళ్తున్న లాయర్లైన తండ్రీ కొడుకులపై కాల్పులు, మృతి

అమెరికా జట్టును భయపెడుతున్న టీమిండియా ప్లేయర్‌ ఎవరు ??

వందే భారత్ రైలు పై రాళ్ల దాడి.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు

అంత్యక్రియలు జరిగిన 13 రోజుల తర్వాత.. ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తి