అమెరికా జట్టును భయపెడుతున్న టీమిండియా ప్లేయర్‌ ఎవరు ??

అమెరికా జట్టును భయపెడుతున్న టీమిండియా ప్లేయర్‌ ఎవరు ??

Phani CH

|

Updated on: Jun 14, 2024 | 10:54 PM

టీ20 ప్రపంచ కప్‌లో అతిథ్య దేశం అమెరికా అంచనాలను మించి దూసుకెళుతోంది. క్రికెట్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇవ్వడంతో అంతా పసికూనగానే భావించారు. కానీ, తొలి మ్యాచ్‌లోనే కెనడాను చిత్తు చేసి.. పాకిస్థాన్‌పై సంచలన విజయం సాధించి అందరి అంచనాలను తలకిందులు చేసింది మోనాంక్‌ పటేల్‌ సేన. ప్రస్తుతం యూఎస్‌ఏ సూపర్ - 8 రేసులో దూసుకుపోతోంది. గ్రూప్‌ స్టేజ్‌లో భారత్‌తో సమానంగా 4 పాయింట్లను ఖాతాలో వేసుకున్న యూఎస్ఏ నెట్‌రన్‌రేట్‌ వ్యత్యాసంతో రెండో స్థానానికి పరిమితమైంది.

టీ20 ప్రపంచ కప్‌లో అతిథ్య దేశం అమెరికా అంచనాలను మించి దూసుకెళుతోంది. క్రికెట్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇవ్వడంతో అంతా పసికూనగానే భావించారు. కానీ, తొలి మ్యాచ్‌లోనే కెనడాను చిత్తు చేసి.. పాకిస్థాన్‌పై సంచలన విజయం సాధించి అందరి అంచనాలను తలకిందులు చేసింది మోనాంక్‌ పటేల్‌ సేన. ప్రస్తుతం యూఎస్‌ఏ సూపర్ – 8 రేసులో దూసుకుపోతోంది. గ్రూప్‌ స్టేజ్‌లో భారత్‌తో సమానంగా 4 పాయింట్లను ఖాతాలో వేసుకున్న యూఎస్ఏ నెట్‌రన్‌రేట్‌ వ్యత్యాసంతో రెండో స్థానానికి పరిమితమైంది. బుధవారం నాడు టీమిండియాకు అమెరికాకు మధ్య కీలక పోరు ఉంది. ఇందులో భారత్‌ గెలిస్తే సూపర్‌ – 8కి చేరుకున్నట్లే. ఇటు యూఎస్‌ఏ విజయం సాధించినా ఆ జట్టే ముందడుగు వేస్తుంది. పాక్‌ ఆశలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్లేయర్ ఆరోన్ జోన్స్ కీలక కామెంట్స్‌ చేశాడు. భారత జట్టుకు గట్టి పోటీనిస్తాం. నిర్భయంగా ఆడుతాం.. ప్రతి మ్యాచ్‌లోనూ ఇలాగే ఆడేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకే విజయాలు సాధించగలిగాం. దాని కోసం తీవ్రంగా శ్రమించాం. ఇంకా చేస్తూనే ఉన్నాం. భారత జట్టులో ఏ ఆటగాడి నుంచి కఠిన సవాల్‌ ఎదురవుతుందని చెప్పమంటే కష్టమైన పనే. ప్రతి ప్లేయరూ సూపర్‌గా ఆడతారు. బౌలింగ్‌లో మాత్రం జస్‌ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం కష్టం. పిచ్‌ ఎలా స్పందిస్తుందో ఇప్పుడే చెప్పలేం అని జోన్స్‌ కామెంట్స్‌ చేశాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందే భారత్ రైలు పై రాళ్ల దాడి.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు

అంత్యక్రియలు జరిగిన 13 రోజుల తర్వాత.. ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తి

గృహజ్యోతి పథకంలో రూ.లక్షల్లో కరెంట్‌ బిల్లు

పాము కూర వండుకుని తిన్న తమిళనాడు వ్యక్తి జైలుపాలు

రాభిమానినే హత్య చేయించిన హీరో.. వెలుగులోకి సంచలన నిజాలు