వందే భారత్ రైలు పై రాళ్ల దాడి.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు

వందే భారత్ రైలు పై రాళ్ల దాడి.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు

Phani CH

|

Updated on: Jun 14, 2024 | 10:53 PM

వందే భారత్‌ రైలుపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఒక కోచ్‌లోని కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కోచ్‌లోని ప్రయాణికులు ఆందోళన చెందారు. పంజాబ్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం అమృత్‌సర్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై ఫగ్వారా ప్రాంతంలో రాళ్లు రువ్వారు. దీంతో సీ 3 కోచ్‌లోని రెండు విండో గ్లాస్‌లు పగుళ్లిచ్చాయి. పెద్ద శబ్దానికి అక్కడ కూర్చొన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు.

వందే భారత్‌ రైలుపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఒక కోచ్‌లోని కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కోచ్‌లోని ప్రయాణికులు ఆందోళన చెందారు. పంజాబ్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం అమృత్‌సర్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై ఫగ్వారా ప్రాంతంలో రాళ్లు రువ్వారు. దీంతో సీ 3 కోచ్‌లోని రెండు విండో గ్లాస్‌లు పగుళ్లిచ్చాయి. పెద్ద శబ్దానికి అక్కడ కూర్చొన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అయితే ఎవరికీ ఏమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న వందే భారత్‌ రైలు సిబ్బంది ఆ కోచ్‌ వద్దకు చేరుకున్నారు. రాళ్ల దాడిలో ధ్వంసమైన కిటికీ అద్దాలను పరిశీలించారు. కొందరు పిల్లలు రాళ్లు విసిరినట్లు ప్రయాణికులు ఆరోపించారు. అయితే ఈ సంఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో వందే భారత్‌ రైలుపై రాళ్ల దాడి జరగడం ఇదే తొలిసారని వెల్లడించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంత్యక్రియలు జరిగిన 13 రోజుల తర్వాత.. ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తి

గృహజ్యోతి పథకంలో రూ.లక్షల్లో కరెంట్‌ బిల్లు

పాము కూర వండుకుని తిన్న తమిళనాడు వ్యక్తి జైలుపాలు

రాభిమానినే హత్య చేయించిన హీరో.. వెలుగులోకి సంచలన నిజాలు