వంతెనపై కారు.. ఎదురుగా పెద్ద ఎలుగుబంటి.. ఏం చేశారంటే ??

ఇటీవల వన్యమృగాలు జనావాసాల్లోకి రావడం పరిపాటిగా మారింది. అడవుల్లో ఆహారం, నీటి కొరతతో జంతువులు గ్రమాల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా అల్లూరి జిల్లా ముంచంగి పుట్టులో ఓ ఎలుగుబంటి కలకలం సృష్టించింది. మాచ్ ఖండ్ జలాశయం సమీపంలోని డుడుమ డ్యాం వద్ద రాత్రివేళ ఎలుగుబంటి సంచారం తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

Follow us

|

Updated on: Jun 15, 2024 | 12:20 PM

ఇటీవల వన్యమృగాలు జనావాసాల్లోకి రావడం పరిపాటిగా మారింది. అడవుల్లో ఆహారం, నీటి కొరతతో జంతువులు గ్రమాల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా అల్లూరి జిల్లా ముంచంగి పుట్టులో ఓ ఎలుగుబంటి కలకలం సృష్టించింది. మాచ్ ఖండ్ జలాశయం సమీపంలోని డుడుమ డ్యాం వద్ద రాత్రివేళ ఎలుగుబంటి సంచారం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. డ్యాం వంతెనపైనుంచి కారులో వెళ్తున్న కొందరు డ్యాం ఆపరేటర్ గదికి సమీపంలో ఎలుగుబంటిని చూసి భయాందోళనకు గురయ్యారు. ఆ ఎలుగుబంటి చూడ్డానికి చాలా పెద్దగా ఉంది. దానిని చూసి గుండె ఆగినంత పని అయింది. అది ఎక్కడ తమపై దాడి చేస్తుందోనని ఆందోళన చెందారు. అయితే నేరుగా వెళ్లి ఎలుగును తరుముదామంటే దాడి చేస్తుందని భయపడిన వారు ధైర్యం చేసి కారుతోనే దానిని అడవిలోకి పంపించారు. చీకట్లో ఉన్న వెలుగుబంటి పై కారు లైట్లు వేస్తూ హారన్‌ కొడుతూ ఎలుగుబంటికి కంగారు పుట్టించారు. దాంతో భయపడిన ఆ ఎలుగుబంటి.. పరుగు లంకించుకుంది. అలా వంతెన దాటి అడవిలోకి వెళ్లేవరకూ వారు కారుతో ఎలుగును వెంబడించారు. చివరికి ఎలుగుబంటి సమీప అడవుల్లోకి పారిపోయింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dhanush: అంతర్జాతీయ ఫిల్మ్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో ధనుష్‌ సినిమా

Kamal Haasan: మేకప్ కోసం 3 గంటలు కష్టం.. కమల్‌ ఓపికకు దండం !!

ఆ స్టార్ హీరోయిన్‌ NTRని మూడు సార్లు రిజెక్ట్ చేసిందట

వేదికపై మోదీ తనతో ఏం మాట్లాడారో చెప్పిన చిరు..

TOP 9 ET News: హాలీవుడ్ గడ్డపై హిస్టరీ క్రియేట్ చేసిన కల్కి! | NTRకి సైడ్ ఇచ్చిన పవర్ స్టార్