ఐస్ క్రీం తింటూ ఉంటే గట్టిగా తగిలింది.. లోపల చూస్తే

ముంబైలోని ఓ డాక్టర్‌కి వింత అనుభవం ఎదురైంది. మలాడ్ ప్రాంతానికి చెందిన ఓర్లెమ్‌ బ్రెండన్‌ సెర్రావో అనే డాక్టర్‌కి ఐస్‌క్రీమ్‌ తినాలనిపించింది. వెంటనే తన ఫోన్‌ తీసుకుని ఆన్‌లైన్ యాప్ ద్వారా మూడు ఐస్‌క్రీమ్ కోన్‌లను ఆర్డర్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఐస్ క్రీమ్స్‌ ఇంటికి డెలివరీ అయ్యాయి. దాంతో ఎంతో ఆశగా ఓ ఐస్‌క్రీమ్‌ను తీసుకుని తినడం మొదలు పెట్టాడు.

ఐస్ క్రీం తింటూ ఉంటే గట్టిగా తగిలింది.. లోపల చూస్తే

|

Updated on: Jun 15, 2024 | 12:25 PM

ముంబైలోని ఓ డాక్టర్‌కి వింత అనుభవం ఎదురైంది. మలాడ్ ప్రాంతానికి చెందిన ఓర్లెమ్‌ బ్రెండన్‌ సెర్రావో అనే డాక్టర్‌కి ఐస్‌క్రీమ్‌ తినాలనిపించింది. వెంటనే తన ఫోన్‌ తీసుకుని ఆన్‌లైన్ యాప్ ద్వారా మూడు ఐస్‌క్రీమ్ కోన్‌లను ఆర్డర్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఐస్ క్రీమ్స్‌ ఇంటికి డెలివరీ అయ్యాయి. దాంతో ఎంతో ఆశగా ఓ ఐస్‌క్రీమ్‌ను తీసుకుని తినడం మొదలు పెట్టాడు. ఇంతలో నాలుకకు ఏదో గట్టి పదార్థం తగిలింది. అది ఏదైనా నట్‌ లేదా చాక్లెట్‌ ముక్క అయి ఉండొచ్చు అనుకున్నాడు. కానీ, అనుమానం వచ్చి ఐస్‌క్రీమ్‌ను పరిశీలించి చూశాడు. అందులో రెండు అంగులాల మనిషి చేతి వేలు కనిపించింది. దీంతో అతడు ఒక్కసారిగా షాకయ్యాడు. వెంటనే మలాడ్‌లోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వైద్యుడి పిర్యాదుపై స్పందించిన పోలీసులు వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం పోలీసులు ఐస్ క్రీం నమూనాను ల్యాబ్ కు పంపినట్టు పోలీసు అధికారులు తెలిపారు. తన అనుభవాన్ని బ్రెండన్‌ ఇలా షేర్‌ చేశారు. ఉదయం నాసోదరి ఆన్‌లైన్ డెలివరీ యాప్ ద్వారా కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేస్తోంది.. దీంతో నేను మూడు బటర్‌స్కాచ్ కోన్ ఐస్‌క్రీమ్‌లను జాబితాలో చేర్చమని చెప్పాను. డెలివరీ రాగానే కోన్‌ ఐస్‌క్రీం తింటూ ఆస్వాదిస్తుండగా ఈ భయంకరమైన అనుభవం ఎదురైంది అంటూ తెలిపారు. అయితే నిజంగానే ఇది మనిషి చేతి వేలు ముక్కా, లేక మరేదైనానా అనేది విచారణలో తేలనుంది. మరోవైపు ఈ వ్యవహారంపై ఐస్ క్రీం తయారీదారు ఇంకా స్పందించలేదు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మఖానా… ఎవరు తినొచ్చు !! ఎవరు తినకూడదు ??

మ్యాన్‌హోళ్లు తెరిస్తే కఠిన చర్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే.. క్రిమినల్ కేసులు

వంతెనపై కారు.. ఎదురుగా పెద్ద ఎలుగుబంటి.. ఏం చేశారంటే ??

Dhanush: అంతర్జాతీయ ఫిల్మ్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో ధనుష్‌ సినిమా

Kamal Haasan: మేకప్ కోసం 3 గంటలు కష్టం.. కమల్‌ ఓపికకు దండం !!

Follow us
BH సిరిస్‌ కలిగిన నంబర్‌ ప్లేట్‌ ఎవరికి కేటాయిస్తారు?
BH సిరిస్‌ కలిగిన నంబర్‌ ప్లేట్‌ ఎవరికి కేటాయిస్తారు?
వచ్చే 2 రోజులు ఈ ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
వచ్చే 2 రోజులు ఈ ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
విద్యుత్ కమిషన్‌ ఎంక్వైరీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
విద్యుత్ కమిషన్‌ ఎంక్వైరీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
ముఖ సౌందర్యానికి బేకింగ్ సోడా వినియోగించవచ్చా?
ముఖ సౌందర్యానికి బేకింగ్ సోడా వినియోగించవచ్చా?
50 రూపాయలకే సినిమా టికెట్ ఇస్తామంటున్న హీరో..
50 రూపాయలకే సినిమా టికెట్ ఇస్తామంటున్న హీరో..
ఈ చిన్న గింజలతో.. మొత్తం శరీరమే ఆరోగ్యంగా ఉంటుంది..
ఈ చిన్న గింజలతో.. మొత్తం శరీరమే ఆరోగ్యంగా ఉంటుంది..
మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్‌
మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్‌
అనంత్ అంబానీ పెళ్లి కోసం.. జక్కన్నకు ఇచ్చిన మాట తప్పిన మహేశ్ బాబు
అనంత్ అంబానీ పెళ్లి కోసం.. జక్కన్నకు ఇచ్చిన మాట తప్పిన మహేశ్ బాబు
ఇలాంటిలక్షణాలు మీలోకూడా కనిపిస్తున్నాయా? వెంటనే బ్రేక్‌ తీసుకోండి
ఇలాంటిలక్షణాలు మీలోకూడా కనిపిస్తున్నాయా? వెంటనే బ్రేక్‌ తీసుకోండి
భయపెడితే భయపడే వాణ్ణికాదు, మంచితనానికి లొంగుతాః బాలినేని
భయపెడితే భయపడే వాణ్ణికాదు, మంచితనానికి లొంగుతాః బాలినేని