మఖానా… ఎవరు తినొచ్చు !! ఎవరు తినకూడదు ??

పోషకాలు అధికంగా ఉండే ఆహారాల్లో మఖానా ఒకటి. రక్తంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించం నుంచి ఎముకలను బలోపేతం చేయడం వరకు, మలబద్ధకంతో సహా వివిధ సమస్యలకు మఖానా ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. మఖానాలో ప్రొటీన్లు, పీచు, ఇనుము, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు మఖానా ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజుకు 5 నుంచి 6 సార్లు మఖానా తినవచ్చు. మఖానాలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ అందరూ తినకూడదు.

మఖానా... ఎవరు తినొచ్చు !! ఎవరు తినకూడదు ??

|

Updated on: Jun 15, 2024 | 12:24 PM

పోషకాలు అధికంగా ఉండే ఆహారాల్లో మఖానా ఒకటి. రక్తంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించం నుంచి ఎముకలను బలోపేతం చేయడం వరకు, మలబద్ధకంతో సహా వివిధ సమస్యలకు మఖానా ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. మఖానాలో ప్రొటీన్లు, పీచు, ఇనుము, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు మఖానా ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజుకు 5 నుంచి 6 సార్లు మఖానా తినవచ్చు. మఖానాలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ అందరూ తినకూడదు. ముఖ్యంగా కొన్ని శారీరక సమస్యలు ఉన్న వారు మఖానా తినడం వల్ల మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతుంది. ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు నూనె, అధిక మసాలాలతో వండిన మఖానా అస్సలు తినకూడదు. తినడం వల్ల ఎసిడిటీ, పొట్ట ఉబ్బరం సమస్య పెరుగుతుంది. కిడ్నీ స్టోన్ సమస్యలు ఉన్నవారికీ మఖానా మంచిది కాదు. శరీరంలో కాల్షియం స్థాయిలు పెరగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కాల్షియం అధికంగా ఉండే ఈ ఆహారాన్ని తినడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. చాలామంది మఖానాలో రుచికి కొంచెం ఎక్కువ ఉప్పు వేస్తారు. అధిక రక్తపోటు రోగులకు ఉప్పు హానికరం. కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు అదనపు ఉప్పు కలిగిన మఖానా తినకూడదు. డయేరియా సమస్య ఉన్నా మఖానా తినకూడదు. ఇందులో పీచు ఎక్కువగా ఉండటం వల్ల డయేరియా సమస్య మరింత పెరుగుతుంది. ఈ విషయాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే చెప్పడం జరిగింది. వీటిని ఆచరించేముందు మీ వైద్య, ఆహార నిపుణులను సంప్రదిస్తే మంచిది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మ్యాన్‌హోళ్లు తెరిస్తే కఠిన చర్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే.. క్రిమినల్ కేసులు

వంతెనపై కారు.. ఎదురుగా పెద్ద ఎలుగుబంటి.. ఏం చేశారంటే ??

Dhanush: అంతర్జాతీయ ఫిల్మ్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో ధనుష్‌ సినిమా

Kamal Haasan: మేకప్ కోసం 3 గంటలు కష్టం.. కమల్‌ ఓపికకు దండం !!

ఆ స్టార్ హీరోయిన్‌ NTRని మూడు సార్లు రిజెక్ట్ చేసిందట

Follow us
Latest Articles