కోర్టుకు వెళ్తున్న లాయర్లైన తండ్రీ కొడుకులపై కాల్పులు, మృతి

కోర్టుకు వెళ్తున్న లాయర్లైన తండ్రీ కొడుకులపై కాల్పులు, మృతి

Phani CH

|

Updated on: Jun 14, 2024 | 10:56 PM

లాయర్లైన తండ్రీకొడుకులు కలిసి బైక్‌పై కోర్టుకు వెళ్తున్నారు. మార్గమధ్యలో కాపుకాసిన దుండగులు వారిపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో తండ్రీకుమారులు మరణించారు. వీరి మృతిపై న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. కాల్పులు జరిపిన నేరగాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బీహార్‌లోని ఛప్రాలో ఈ సంఘటన జరిగింది.

లాయర్లైన తండ్రీకొడుకులు కలిసి బైక్‌పై కోర్టుకు వెళ్తున్నారు. మార్గమధ్యలో కాపుకాసిన దుండగులు వారిపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో తండ్రీకుమారులు మరణించారు. వీరి మృతిపై న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. కాల్పులు జరిపిన నేరగాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బీహార్‌లోని ఛప్రాలో ఈ సంఘటన జరిగింది. రామ్‌ అయోధ్య ప్రసాద్‌ రాయ్‌, ఆయన కుమారుడు సునీల్‌ కుమార్‌ రాయ్‌ న్యాయవాదులు. బుధవారం ఉదయం తండ్రీకొడుకులు కలిసి బైక్‌పై జిల్లా కోర్టుకు బయలుదేరారు. కాగా, దుధియా బ్రిడ్జి వద్ద మాటువేసిన దుండగులు తండ్రీకొడుకులైన లాయర్లపై గన్‌తో కాల్పులు జరిపి పారిపోయారు. బుల్లెట్‌ గాయాలతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భూతగాదాల కారణంగా హత్య చేసినట్లు అనుమానించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న కోర్టు న్యాయవాదులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ నిరసనకు దిగారు. తండ్రీకొడుకులైన లాయర్లపై గన్‌తో కాల్పలు జరిపి హత్య చేయడాన్ని ఖండించారు. నిందితులైన నేరస్తులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికా జట్టును భయపెడుతున్న టీమిండియా ప్లేయర్‌ ఎవరు ??

వందే భారత్ రైలు పై రాళ్ల దాడి.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు

అంత్యక్రియలు జరిగిన 13 రోజుల తర్వాత.. ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తి

గృహజ్యోతి పథకంలో రూ.లక్షల్లో కరెంట్‌ బిల్లు

పాము కూర వండుకుని తిన్న తమిళనాడు వ్యక్తి జైలుపాలు