Bay Leaf for Hair: బిర్యానీ ఆకుల‌తో చుండ్రును త‌గ్గించుకోవ‌చ్చు తెలుసా.. జుట్టు పొడవుగా పెరుగుతుంది

ఆ నీటిలో ఒక చెంచా కొబ్బరి నూనె వేసి జుట్టుకు, తలకు బాగా పట్టించి మసాజ్ చేయాలి. సుమారు గంటపాటు అలాగే వదిలేసి తలస్నానం చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే..స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు, మొటిమలు, డ్రైనెస్ తగ్గిపోతుంది. జుట్టులో తేమ అలాగే ఉంటుంది. కొబ్బరి నూనె వాడటం వల్ల జుట్టు మూలాలు బలపడతాయి.

Bay Leaf for Hair: బిర్యానీ ఆకుల‌తో చుండ్రును త‌గ్గించుకోవ‌చ్చు తెలుసా.. జుట్టు పొడవుగా పెరుగుతుంది
Bay Leaf For Hair
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 14, 2024 | 6:46 PM

మీరు కూడా చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అవును అయితే, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం డాండ్రఫ్‌ను దూరం చేసే బెస్ట్‌ హోం రెమిడీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చుండ్రు సమస్య నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా, అనేక జుట్టు సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది. పొడి స్కాల్ప్ వల్ల వచ్చే దురద వంటి సమస్యలను తొలగించడానికి ఈ చిట్కా అద్బుతం చేస్తుంది. వీటిలో ఉండే పదార్దాలు జుట్టును ఆరోగ్యంగా ఉండేలా బాగా చూసుకుంటాయి.

తలలో చుండ్రు సమస్యను వదిలించుకోవడానికి ప్రజలు అనేక మార్గాలు ప్రయత్నిస్తారు. కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి రాసుకుంటారు. హెయిర్ మాస్క్ తయారు చేసి పెరుగును పూస్తారు. మీ వంటగదిలో ఇటువంటి అనేక మూలికలు ఉన్నాయి. ఇవన్నీ జుట్టు సమస్యలను పరిష్కరించగలవు. అయితే, బిర్యానీ ఆకు కూడా జుట్టు సమస్యలకు పరిష్కారం చూపుతుందని మీకు తెలుసా..? బిర్యానీ ఆకులతో హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి, దానిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

బిర్యానీ ఆకు ఎంతో ఆరోగ్యకరమైన హెర్బ్. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ అంశాలు ఉంటాయి. ఈ ఆకులతో హెయిర్ మాస్క్‌ను తయారు చేసి, దానిని తలకు అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్యను చాలా వరకు అధిగమించవచ్చు. ఇది తలపై ఉండే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, దురద, దద్దుర్లు, పొడిబారడం మొదలైనవాటిని తగ్గిస్తుంది. దీన్ని అప్లై చేయడం వల్ల స్కాల్ప్ తేమగా ఉంటుంది. ఇది చుండ్రును చాలా వరకు వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

మీరు వేప, బిర్యానీ ఆకుల హెయిర్ మాస్క్‌ని తయారు చేసి దానిని మీ జుట్టుకు అప్లై చేయండి. దీని కోసం, 5 నుండి 7 బిర్యానీ ఆకులను నీటిలో బాగా ఉడికించాలి. ఇప్పుడు ఇది చల్లారిన తరువాత మిక్సీలో పేస్ట్‌లా చేసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వేప నూనెను యాడ్‌ చేసుకోవాలి. రెండు చెంచాల అలోవెరా జెల్, ఉసిరి పొడిని మిక్స్ చేస్తే, అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పేస్ట్‌ను తలకు పట్టించి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు స్మూత్‌గా మసాజ్ చేసి, ఆపై షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలి.

చుండ్రు కారణంగా తల దురదగా ఉంటే నాలుగైదు బిర్యానీ ఆకులను నీటిలో ఉడకబెట్టి, ఆ నీటిలో ఒక చెంచా కొబ్బరి నూనె వేసి జుట్టుకు, తలకు బాగా పట్టించి మసాజ్ చేయాలి. సుమారు గంటపాటు అలాగే వదిలేసి తలస్నానం చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే..స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు, మొటిమలు, డ్రైనెస్ తగ్గిపోతుంది. జుట్టులో తేమ అలాగే ఉంటుంది. కొబ్బరి నూనె వాడటం వల్ల జుట్టు మూలాలు బలపడతాయి.

మరో విధానంలో బిర్యానీ ఆకులను ఒక బౌల్‌ నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు సగానికి తగ్గినప్పుడు, గ్యాస్‌ను ఆపేయాలి. నీళ్లు గోరువెచ్చగా ఉండగానే ఈ నీటితో జుట్టును బాగా పట్టించాలి. ఇది హెయిర్ కండీషనర్ లా పని చేస్తుంది. ఇది మీ జుట్టుకు మెరుపును తెస్తుంది. మీరు చుండ్రు నుండి విముక్తి పొందుతారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..