తెలంగాణలో జూలై 7 నుంచి బోనాల ఉత్సవాలు షురూ

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల వేడుక నిర్వహిస్తారు. సికింద్రాబాద్ బోనాలకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి.  ఇక్కడ రంగం కార్యక్రమాన్ని అమ్మవారి భక్తులతో పాటుగా ప్రజలంతా ఎంతో ఆసక్తిగా వింటారు. సికింద్రాబాద్ తరువాతి వారం లాల్ దర్వాజ మహంకాళి ఆలయాల్లో ప్రతి గురు, ఆదివారాలు నెల రోజుల పాటు హైదరాబాద్ నగరమంతట బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.

తెలంగాణలో జూలై 7 నుంచి బోనాల ఉత్సవాలు షురూ
Bonalu
Follow us

|

Updated on: Jun 14, 2024 | 7:38 PM

నగరంలో జులై 7 నుంచి బోనాల వేడుకలు మొదలుకానున్నాయి.. గోల్కొండలోని జగదాంబికా గుడిలో తొలి బోనంతో ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాడంలో బోనాలు మొదలవుతాయి. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు భక్తులు. అమ్మవారికి తీరొక్క నైవేద్యం సమర్పిస్తారు.

జూలై 7న ఆషాఢమాసం మొదటి ఆదివారం భాగ్యనగరంలో బోనాల సంబరం మొదలవుతుంది.  గోల్గొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజా కార్యక్రమాలు వేడుకగా నిర్వహిస్తారు. ఆ తరువాత రెండో వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల వేడుక నిర్వహిస్తారు. సికింద్రాబాద్ బోనాలకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి.  ఇక్కడ రంగం కార్యక్రమాన్ని అమ్మవారి భక్తులతో పాటుగా ప్రజలంతా ఎంతో ఆసక్తిగా వింటారు.

సికింద్రాబాద్ తరువాతి వారం లాల్ దర్వాజ మహంకాళి ఆలయాల్లో ప్రతి గురు, ఆదివారాలు నెల రోజుల పాటు హైదరాబాద్ నగరమంతట బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ నగరంలో ప్రతి ఏడాది బోనాల వేడుక మూడు దశలలో జరుగుతుంది. వాటిని గోల్కొండ బోనాలు, లష్కర్ బోనాలు, ఉజ్జయినీ మహంకాళి బోనాలు అనే పేర్లతో జరుపుకుంటారు.

హైదరాబాద్ లోని హరీబౌలి లో ఉన్న శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి గుడి, లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి గుడిలో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. 150 ఏళ్ల క్రితం కలరా మహమ్మారి రావడంతో తొలిసారి ఈ బోనాలు పండుగ వేడుకలు జరుపుకున్నారని చరిత్ర చెప్తుంది.

మహంకాళి అమ్మవారి ఆగ్రహం కారణంగానే నాడు కలరా వ్యాపించిందని ఓ నమ్మకం. అప్పటి నుంచి అమ్మవారికి బోనాలు వేడుకలు జరుపుకుంటు న్నారు హైదరాబాద్ నగర ప్రజలు.