AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓర్నీ ఇదేక్కడి విడ్డూరం…పబ్లిక్ టాయిలెట్ బయట టైమర్‌..? ఎంతసేపు లోపల ఉన్నారో చూస్తారట..

ఇక్కడ నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లలో టైమర్‌లు అమర్చబడి ఉన్నాయంటూ చెప్పే పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ టైమర్లతో తలుపు ఎంతసేపు టాయిలెంట్ డోర్ మూసివేయబడి ఉందో తెలుస్తుంది.  అంటే ఒక వ్యక్తి బాత్రూమ్ లోపల ఎంతసేపు ఉన్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై దుమారం రేగడంతో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

ఓర్నీ ఇదేక్కడి విడ్డూరం...పబ్లిక్ టాయిలెట్ బయట టైమర్‌..? ఎంతసేపు లోపల ఉన్నారో చూస్తారట..
Timer Installed In Public Toilet
Jyothi Gadda
|

Updated on: Jun 16, 2024 | 3:49 PM

Share

మీరు కూడా ఎప్పుడో ఒకసారి పబ్లిక్ టాయిలెట్‌కి వెళ్లే ఉంటారు. అయితే పబ్లిక్ టాయిలెట్ లోపల ఎవరు ఎంతసేపు కూర్చున్నారో చెప్పే టైమర్‌ని మీరు ఎప్పుడైనా చూశారా? ఇదేంటనీ ఆశ్చర్యంగా ఉంది కదా..? కానీ, ఇలాంటి దృశ్యానికి సంబంధించిన పోస్ట్‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పబ్లిక్ టాయిలెట్‌లో టైమర్ ఇన్‌స్టాల్ చేయడం ఏంటని ఈ పోస్ట్‌ చూసిన ప్రజల్లో గందరగోళం మొదలైంది. పబ్లిక్ టాయిలెట్ బయట ఉన్న టైమర్ ప్రజలు లోపల ఎంతసేపు ఉన్నారో చూపిస్తుంది. అంటే ఒక వ్యక్తి బాత్రూమ్ లోపల ఎంతసేపు ఉన్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై దుమారం రేగడంతో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇది జరిగింది ఎక్కడో కాదు. డ్రాగన్‌ కంట్రీ చైనాలో. పూర్తి వివరాల్లోకి వెళితే..

నిజంగానే చైనా అన్ని పరిమితులను దాటింది. ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్‌లో టైమర్ ఇన్‌స్టాల్ చేసింది. ఇటీవల యుంగాంగ్ బౌద్ధ గ్రోటోలలో టాయిలెట్ టైమర్‌లను ఇన్‌స్టాల్ చేసింది. చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లోని యుంగాంగ్ బౌద్ధ గ్రోటోస్ ఒక పురాతన బౌద్ధ దేవాలయం. ఇక్కడ 200 కంటే ఎక్కువ గుహలు, వేలాది బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. యునెస్కో దీనికి ప్రపంచ వారసత్వ హోదా కల్పించింది. ఇక్కడ నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లలో టైమర్‌లు అమర్చబడి ఉన్నాయంటూ చెప్పే పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ టైమర్లతో తలుపు ఎంతసేపు టాయిలెంట్ డోర్ మూసివేయబడి ఉందో తెలుస్తుంది.  అంటే ఒక వ్యక్తి బాత్రూమ్ లోపల ఎంతసేపు ఉన్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై దుమారం రేగడంతో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

టైమర్‌లు ఎందుకు ఇన్‌స్టాల్ చేశారు..

ఇక్కడ ఒక ఉద్యోగి చెప్పిన వివరాల ప్రకారం.. పర్యాటకులు బాత్రూంలో అవసరమైన దానికంటే ఎక్కువ సమయం గడుపుతున్నారని అంటున్నారు.. బాత్రూమ్ లోపల వారికి ఏదైనా జరిగితే, అత్యవసర పరిస్థితి తలెత్తితే, అటువంటి పరిస్థితిలో వారు సేవ్ చేయబడతారు. అంటే పర్యాటకుల భద్రత కోసం ఈ టైమర్ ఏర్పాటు చేసినట్టుగా వెల్లడించారు. అయితే మరోవైపు కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.

టాయిలెట్‌లో కూర్చునే సమయాన్ని నిర్ణయిస్తారా?

బాత్రూమ్‌ను ఉపయోగించే సమయాన్ని టైమర్ నిర్ణయించదని మరో ఉద్యోగి చెప్పారు. బాత్రూమ్ లోపల ఎవరైనా ఎంత సమయం అయినా గడపవచ్చు. ఈ టైమర్ తలుపు ఎంతసేపు మూసివేయబడిందో చూపుతుంది. ఇలా చేస్తే బయటి వ్యక్తులు అనవసరంగా తలుపు తట్టాల్సిన అవసరం ఉండదు. అదే సమయంలో, మరికొందరు ఉద్యోగులు మాట్లాడుతూ, ఎవరైనా ఎక్కువ సమయం బాత్‌రూమ్‌లో నుండి బయటకు రాలేదంటే ఏమైందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఈ టైమర్‌ను ఇన్‌స్టాల్ చేయడం వెనుక ఉన్న హేతువును ఉద్యోగులు ఇచ్చినప్పటికీ చైనాలో కలకలం రేగింది. తమ ప్రైవసీకి భంగం వాటిల్లుతోందని అక్కడికి వచ్చే పర్యాటకులు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..