Viral Video: చల్లచల్లని ఐస్‌క్రీమ్‌‌లో కనిపించిన పొడవాటి ఆకారం.. ఏంటని చూడగా.. వామ్మో

మాములుగా పాములే కాదు.. తేళ్లు, జెర్రిలు లాంటి వాటిని మనం దూరం నుంచి చూస్తూనే దడుసుకుంటాం. అలాంటిది అవి మనకు మరింత దగ్గరగా కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.. వాటిని చూడగానే ఒళ్లంతా జలదరించిపోతుంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్లు తెప్పించుకుంటుంటే..

Viral Video: చల్లచల్లని ఐస్‌క్రీమ్‌‌లో కనిపించిన పొడవాటి ఆకారం.. ఏంటని చూడగా.. వామ్మో
Viral Video
Follow us

|

Updated on: Jun 16, 2024 | 2:43 PM

మాములుగా పాములే కాదు.. తేళ్లు, జెర్రిలు లాంటి వాటిని మనం దూరం నుంచి చూస్తూనే దడుసుకుంటాం. అలాంటిది అవి మనకు మరింత దగ్గరగా కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.. వాటిని చూడగానే ఒళ్లంతా జలదరించిపోతుంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్లు తెప్పించుకుంటుంటే.. ఆయా పార్శిళ్లలో చిత్రవిచిత్రమైనవి కనిపిస్తోన్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. మొన్నీమధ్య ముంబైలో ఓ వ్యక్తికి ఐస్‌క్రీమ్ కోన్‌లో మనిషి వేలి కనిపించిన షాకింగ్ ఘటన మరవకముందే.. ఇదే తరహాలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. చిల్ అవ్వడానికి.. చల్లచల్లని ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసింది ఓ మహిళ. ఇక ఆ ఐస్‌క్రీమ్ బాక్స్ ఓపెన్ చేసి చూడగా.. ఊహించని షాక్ తగిలింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగింది.

వివరాల్లోకెళ్తే.. నోయిడాకు చెందిన ఓ మహిళ ఆన్‌లైన్‌లో చల్లటి ఐస్‌క్రీమ్ ఆర్డర్ పెట్టింది. ఇక కొద్దిసేపటికి ఆ పార్శిల్ ఇంటికి రానే వచ్చింది. ఆవురావురుమని ఆ ఐస్‌క్రీమ్ బాక్స్ ఓపెన్ చేయగా.. అందులో ఒక జెర్రి కనిపించింది. చల్లదనానికి గడ్డకట్టి చనిపోయిన ఆ జెర్రి.. ఐస్‌క్రీమ్ మూతకు అతుక్కొని ఉంది. జూన్ 15న ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ జెర్రిని చూసి షాక్ అయిన సదరు మహిళ.. కొంతసేపటికి ఆ షాక్ నుంచి తేరుకుని వెంటనే ఐస్‌క్రీమ్ పెట్టిన సంస్థకు ఫిర్యాదు చేసింది.

ఆ సంస్థ ఆమెకు తిరిగి డబ్బులు రీఫండ్ ఇవ్వడమే కాకుండా.. ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెట్టింది. అయితే ఆ బ్రాండెడ్ ఐస్‌క్రీమ్‌ సంస్థ మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదని తెలుస్తోంది. కాగా, ప్రసుత్తం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరలవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ కావడమే కాకుండా.. దీనిపై వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles