Salt: ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఎన్ని నష్టాలో.. వెన్నులో వణుకు పుట్టించే సైడ్‌ ఎఫెక్ట్స్!

మన శరీరానికి అవసరమైన పోషకాలలో సోడియం ఒకటి. ఇది ఉప్పులో ఎక్కువగా కనిపిస్తుంది. సోడియం లోపం వల్ల శరీరంలో వివిధ సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఆహారంతో ఉప్పు తగినంత తినడం చాలా ముఖ్యం. అయితే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే అధిక ఉప్పు వినియోగం ఆరోగ్యానికి హానికరం. చాలా మంది ఉప్పు అవసరాన్ని బట్టి, రుచికి కాస్త ఎక్కువగా..

Salt: ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఎన్ని నష్టాలో.. వెన్నులో వణుకు పుట్టించే సైడ్‌ ఎఫెక్ట్స్!
Salt Side Effects
Follow us

|

Updated on: Jun 17, 2024 | 12:32 PM

మన శరీరానికి అవసరమైన పోషకాలలో సోడియం ఒకటి. ఇది ఉప్పులో ఎక్కువగా కనిపిస్తుంది. సోడియం లోపం వల్ల శరీరంలో వివిధ సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఆహారంతో ఉప్పు తగినంత తినడం చాలా ముఖ్యం. అయితే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే అధిక ఉప్పు వినియోగం ఆరోగ్యానికి హానికరం. చాలా మంది ఉప్పు అవసరాన్ని బట్టి, రుచికి కాస్త ఎక్కువగా తింటారు. ఉప్పును వంటలలో మాత్రమే కాకుండా, సలాడ్‌లలో, భోజనం చివరలో కూడా విడిగా తింటుంటారు. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో సోడియం పెరుగుతుంది. ఫలితంగా ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇది గుండె సమస్యల నుంచి అధిక రక్తపోటు వరకు పలు రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇది చర్మాన్ని కూడా దెబ్బతీస్తుంది.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే హానికర దుష్ర్పభావాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

చర్మం వాపు – మొటిమలు

ఉప్పు ఎక్కువగా తినే వ్యక్తుల ముఖం నుంచి కళ్లు, పాదాల వరకు ఉబ్బిపోతాయి. అంతే కాదు మొటిమలు, దద్దుర్లు వంటి చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఉప్పు శరీరంలోని నీటిని పీల్చుకోవడమే దీనికి ప్రధాన కారణం. ఫలితంగా శరీర కణాల్లో నీటి కొరత ఏర్పడుతుంది.

పొడి చర్మం

ఉప్పు చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. కానీ, ఉప్పు ఎక్కువగా తినడం మొదలుపెడితే చర్మం వేగంగా తేమను కోల్పోతుంది. ఫలితంగా చర్మం పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. ముడతలు కూడా కనిపిస్తాయి. ఫలితంగా అకాల వృద్ధాప్యం మొదలవుతుంది. అలాగే అధిక ఉప్పు వినియోగం కొల్లాజెన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

సెన్సిటివ్ స్కిన్

చాలా మందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. అయితే ఉప్పు ఎక్కువగా తినడం వల్ల అనేక చర్మ సమస్యలు వస్తాయి. చర్మంపై ఎరుపు దద్దుర్లు, మంట, దురద వంటి చర్మ సమస్యలు సంభవించవచ్చు.

గాయాలు త్వరగా మానవు

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలోని గాయాలు త్వరగా మానవు. పైగా ఎక్కువ ఉప్పు తినడం వల్ల శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. ఇది చర్మ మెరుపును తగ్గిస్తుంది.

(ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది)

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.