Vitamin B12 తక్కువ కాకూడదు.. అలాగని ఎక్కువైనా పేచీనే! ఎందుకంటే..

ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైన పోషకాలలో విటమిన్ B12 ముఖ్యమైనది. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో విటమిన్ B12 చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో విటమిన్ బి12 స్థాయి తగ్గితే, అనేక సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా విలమిన్‌ B12 లోపిస్తే శరీరం లోపలి నుంచి బలహీన పడటం ప్రారంభిస్తుంది. విటమిన్ B12 లోపం కారణంగా జుట్టు రాలడం నుంచి చేతులు, కాళ్ళ వాపు..

Vitamin B12 తక్కువ కాకూడదు.. అలాగని ఎక్కువైనా పేచీనే! ఎందుకంటే..
Vitamin B12
Follow us

|

Updated on: Jun 17, 2024 | 12:51 PM

ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైన పోషకాలలో విటమిన్ B12 ముఖ్యమైనది. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో విటమిన్ B12 చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో విటమిన్ బి12 స్థాయి తగ్గితే, అనేక సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా విలమిన్‌ B12 లోపిస్తే శరీరం లోపలి నుంచి బలహీన పడటం ప్రారంభిస్తుంది. విటమిన్ B12 లోపం కారణంగా జుట్టు రాలడం నుంచి చేతులు, కాళ్ళ వాపు, నొప్పులు వంటి అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అందువల్ల, శరీరంలో విటమిన్ B12 లోపం తలెత్తితే ప్రత్యేక సప్లిమెంట్లను తీసుకోవాలి (డాక్టర్‌ సూచనల మేరకు మాత్రమే). అయితే విటమిన్ B12 శరీరంలో అధికంగా ఉన్న సమస్యే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును.. విటమిన్ B12 లోపం మాత్రమే కాదు, అధికంగా ఉన్నా హాని కలిగిస్తుంది. ఇది అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. శరీరంలో విటమిన్ బి 12 స్థాయి అధికంగా ఉన్న వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

విటమిన్ బి12 అధికంగా ఉండటం వల్ల శరీరంలో ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి..

శరీరంలో విటమిన్ బి12 స్థాయి పెరిగితే అది రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. అదే సమయంలో విటమిన్ బి 12 అధికంగా ఉండటం వల్ల ఆప్టిక్ నాడీ వ్యవస్థకు హాని కలిగించవచ్చు, శరీరంలో విటమిన్ బి 12 అధికంగా ఉంటే వికారం, వాంతులు అవుతాయి. చర్మంపై ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. నిరంతర తలనొప్పి వేధిస్తుంది.

శరీరంలో విటమిన్ బి12 ఎక్కువగా ఉంటే ఏమి చేయాలి?

శరీరంలో విటమిన్ B12 అధికంగా ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. శరీరంలో విటమిన్ బి12 అధికంగా ఉండటం వల్ల అంతర్గత సమతుల్యత దెబ్బతింటుంది. అందువల్ల శరీరంలో విటమిన్ బి 12 అధికంగా ఉండకుండా ఉండటానికి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా చేపలు, సముద్ర ఆహారం తీసుకోకూడదు. పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. చికెన్‌, రెడ్ మీట్ అస్సలు తీసుకోకూడదు.

ఇవి కూడా చదవండి

(ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది)

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.