Gray Beard: చిన్నవయస్సులోనే గడ్డం తెల్లబడుతుందా..? ఇలా చేస్తే చిక్కటి నలుపు
సాధారణంగా వయసు పెరిగేకొద్దీ తెల్లవెంట్రుకలు రావడం కామన్. ఇక మగవారికైతే గడ్డం కూడా నెరిసి తెల్లగా కనిపిస్తుంది. కానీ, ఈరోజుల్లో చాలా మందిని చిన్న వయసులోనే ఇలాంటి సమస్య ఇబ్బంది పడుతోంది. మరి మిమ్మల్ని కూడా తెల్ల గడ్డం బాధిస్తోందా? డోంట్‌వర్రీ.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ గడ్డాన్ని నల్లగా మార్చుకోవచ్చు
బాయ్స్ ఎవరైనా గుబురైన, నల్లని గడ్డం ఉండాలని కోరుకుంటారు. అయితే ప్రజంట్ లైఫ్ స్టైల్ కారణంగా వయస్సు ఇరవైలలో ఉండగానే గడ్డం నెరసిపోతుంది. తెల్ల గడ్డం నల్లగా మార్చడానికి మార్కెట్లో అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని హోమ్ రెమిడీస్ ఫాలో అయితే మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
ముందుగు ఒత్తడి, ఆందోళనకు దూరం జరగండి:
ఇది చెప్పినంత ఈజీ అయితే కాదు కానీ.. ట్రై చేయాల్సిందే. మీ గడ్డం తెల్లగా మారడానికి ఒత్తడి, ఆందోళన ప్రధాన కారణం అని నివేదికలు చెబుతున్నాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా వంటివి ట్రై చేయండి. పుష్కలంగా నీరు త్రాగండి. మీ గడ్డానికి హాని కలిగించే రసాయన ఆధారిత జుట్టు ఉత్పత్తులను ఉపయోగించకుండా ఉండండి.
కొబ్బరి నూనె, నిమ్మ ఆకు మిశ్రమం:
కొబ్బరి నూనె, నిమ్మకాయ ఆకుల మిశ్రమం తెల్ల గడ్డానికి ఎఫెక్టివ్ రెమెడీ. నిమ్మ ఆకులలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రంగును ప్రోత్సహించడంలో సహాయపడతాయి. కొంచెం కొబ్బరి నూనెను వేడి చేసి, దానికి కొన్ని తీపి నిమ్మ ఆకులను కలపండి. మిశ్రమం చల్లారేవరకు వెయిట్ చేయండి, ఆపై దానిని మీ గడ్డానికి అప్లై చేసి, 30 నిమిషాల తర్వాత కడిగేయండి.
ఉసిరి పొడి:
జుట్టును నల్లగా మార్చడానికి ప్రసిద్ధి చెందిన మరొక సహజ నివారణ ఉంది. మీరు ఉసిరికాయ పొడిని నీటితో కలిపి పేస్ట్ లా చేసి మీ గడ్డానికి అప్లై చేయండి.30 నిమిషాలు అలాగే ఉంచి.. ఆ తర్వాత కడిగేయండి.
విటమిన్ B12:
సరైన ఆహారం తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. విటమిన్ బి12, ఐరన్, జింక్ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. ఇది మీ గడ్డం రంగు నల్లగానే ఉండేందుకు సాయం చేస్తాయి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..