Interesting Facts: బ్లాక్ సాల్ట్, పింక్ సాల్ట్, తెల్ల ఉప్పు వీటిల్లో ఏది ఆరోగ్యానికి మంచిది?
ఉప్పులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒక్కో దాని బట్టి రుచి, ఆరోగ్యం కూడా మారుతూ ఉంటుంది. బ్లాక్ సాల్ట్, పింక్ సాల్ట్, తెల్ల ఉప్పు వీటిని మనం ఉపయోగిస్తూనే ఉంటాం. ఒక్కో దాని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా మారిపోతూ ఉంటాయి. మనలో చాలా మంది ఎక్కువగా తెల్ల ఉప్పునే ఉపయోగిస్తారు. కానీ తెల్ల ఉప్పుతో కొన్ని బెనిఫిట్స్ ఉంటూ చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. నిజానికి ముందు..
ఉప్పులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒక్కో దాని బట్టి రుచి, ఆరోగ్యం కూడా మారుతూ ఉంటుంది. బ్లాక్ సాల్ట్, పింక్ సాల్ట్, తెల్ల ఉప్పు వీటిని మనం ఉపయోగిస్తూనే ఉంటాం. ఒక్కో దాని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా మారిపోతూ ఉంటాయి. మనలో చాలా మంది ఎక్కువగా తెల్ల ఉప్పునే ఉపయోగిస్తారు. కానీ తెల్ల ఉప్పుతో కొన్ని బెనిఫిట్స్ ఉంటూ చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. నిజానికి ముందు తెల్ల ఉప్పు మాత్రమే వినియోగంలో ఉంది. ఆ తర్వాత నల్ల ఉప్పు, పింక్ ఉప్పు వచ్చాయి. తెల్ల ఉప్పుతో పోల్చితో వీటిలో ఉండే పోషకాలు వేరు. నల్ల ఉప్పు, పింక్ సాల్ట్ వాడటం వల్ల రక్త పోటు తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి వీటిల్లో ఏది ఉపయోగిస్తే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
పింక్ సాల్ట్:
పింక్ సాల్ట్‌ని హిమాలయన్ ఉప్పు అని కూడా పిలుస్తారు. హిమాలయ పర్వతాల దగ్గర్లో లభ్యమవుతుంది. ఇది లేత గులాబీ రంగులో ఉంటుంది. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. పింక్ సాల్ట్ వాడటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి.
నల్ల ఉప్పు:
నల్ల ఉప్పు కూడా హిమాలయాల్లో ఉండే దగ్గర ఉప్పు గనుల నుంచి వెలికి తీశారు. దీని రంగు భిన్నంగా ఉంటుంది. కాబట్టి రుచి కూడా కాస్త వెరైటీగా ఉంటుంది. నల్ల ఉప్పును మనం ఎక్కువగా షర్బత్, పానీ పూరీ వాటర్‌లో ఉపయోగిస్తూ ఉంటారు. సాధారణ నీటిలో కూడా కలిపి వాడవచ్చు. ఈ ఉప్పు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిదే. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు లభిస్తాయి.
సముద్రపు ఉప్పు:
సముద్రపు నీటిని సేకరించి.. ఎండగట్టడం వల్ల తెల్ల ఉప్పు తయారవుతుంది. దీన్నే రాళ్ల ఉప్పు, కల్లు ఉప్పు అని కూడా పిలుస్తారు. ఈ ఉప్పును పూర్వం నుంచి ఉపయోగిస్తున్నారు. ఇందులో కొద్ది మొత్తంలో మాత్రమే పోషకాలు ఉంటాయి. పింక్ సాల్ట్, నల్ల ఉప్పులో ఉండే ఖనిజాలు ఇందులో ఉండవు. ఈ ఉప్పును చాలా తక్కువ మోతాదులో తీసుకోవడం బెటర్.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)