Glass Bridge: మన దేశంలోనూ గ్లాస్ బ్రిడ్జ్ ఉందని తెలుసా..! ప్రకృతి అందాల వీక్షణం ఓ మధురానుభూతి..

మహాభారత కాలం నాటి పురాతన క్షేత్రాలు, ప్రసిద్ది గాంచిన అనేక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. వీటి సందర్శన పర్యాటకులకు చిరస్మరణీయంగా ఉంటుంది. తాజాగా మరో ఆకర్షణీయమైన ప్రాంతంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇప్పటి వరకు మీరు సోషల్ మీడియాలో చైనాలోని గాజు వంతెనకు సంబంధించిన అనేక వీడియోలను తప్పక చూసి ఉంటారు. అయితే బీహార్‌లో కూడా ఒక గాజు వంతెన ఉందని మీకు తెలుసా.. దీనిని సందర్శించడం వలన ఉత్తేజకరమైన అనుభూతిని కలిగిస్తుంది.

Glass Bridge: మన దేశంలోనూ గ్లాస్ బ్రిడ్జ్ ఉందని తెలుసా..! ప్రకృతి అందాల వీక్షణం ఓ మధురానుభూతి..
Rajgir Glass BridgeImage Credit source: instagram/things2doinpatna
Follow us
Surya Kala

|

Updated on: Jun 17, 2024 | 3:53 PM

బీహార్‌కు చెందిన లిట్టి చోఖా వంటకం దాని రుచితో దేశ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. రుచికరమైన, పోశాకహరమైన ఈ లిట్టి చోఖా ఇప్పుడు దేశంలోని ప్రతి మూలకు చేరుకుంది. నేటు అత్యంత ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ల్లో ఒకటిగా మారింది. అవును బీహార్ రాష్ట్రం విభిన్నమైన రుచి కరమైన ఆహారం, దాని మాండలికం, ప్రత్యేక సంస్కృతితో పాటు ప్రసిద్దిగాంచిన ప్రాంతాలతో పర్యాటకానికి కూడా ప్రసిద్ధి చెందింది. మహాభారత కాలం నాటి పురాతన క్షేత్రాలు, ప్రసిద్ది గాంచిన అనేక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. వీటి సందర్శన పర్యాటకులకు చిరస్మరణీయంగా ఉంటుంది. తాజాగా మరో ఆకర్షణీయమైన ప్రాంతంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది.

ఇప్పటి వరకు మీరు సోషల్ మీడియాలో చైనాలోని గాజు వంతెనకు సంబంధించిన అనేక వీడియోలను తప్పక చూసి ఉంటారు. అయితే బీహార్‌లో కూడా ఒక గాజు వంతెన ఉందని మీకు తెలుసా.. దీనిని సందర్శించడం వలన ఉత్తేజకరమైన అనుభూతిని కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

బీహార్‌లో గాజు వంతెన ఎక్కడ నిర్మించబడిందంటే?

గ్లాస్ బ్రిడ్జ్ గురించి చెప్పాలంటే.. ఇది బీహార్‌లోని రాజ్‌గిర్‌లో నిర్మించబడింది. ఈ వంతెన నుంచి అందమైన పచ్చని ప్రకృతి దృశ్యాలను చూడవచ్చు. ఎందుకంటే ఇది అడవి మధ్యలో నిర్మించబడింది. ఈ వంతెన భారతదేశంలో రెండవ అతిపెద్ద గాజు వంతెన.

థ్రిల్లింగ్ అనుభూతినిస్తుంది

రాజ్‌గిర్‌లోని ఈ వంతెనను సందర్శించడం ఎవరికైనా సరే థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తుంది. ఈ గాజు వంతెన 6 అడుగుల వెడల్పు, 85 అడుగుల పొడవు ఉంటుంది.. ఈ గాజు వంతెన 200 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. కనీసం 40 మంది వ్యక్తులు కలిసి ఈ వంతెన మీద ఏకకాలంలో నడవవచ్చు. ఇక్కడ నిలబడి ప్రకృతి రమణీయ దృశ్యాలను చూడవచ్చు. ఈ వంతెనను 2021 సంవత్సరంలో ప్రారంభించారు.

సమయం టిక్కెట్ ధర

సమాచారం ప్రకారం రాజ్‌గిర్‌లో నిర్మించిన ఈ గాజు వంతెనను సందర్శించడానికి 200 రూపాయల టికెట్ తీసుకోవాలి. రాజ్‌గిర్ అధికారిక సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను కూడా బుక్ చేసుకోవచ్చు. పాట్నా నుంచి ఇక్కడకు నేరుగా టాక్సీలు, బస్సులు ద్వారా చేరుకోవచ్చు. ఈ వంతెనను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శించవచ్చు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

రాజ్‌గిర్‌లో చూడవలసిన మరిన్ని ప్రదేశాలు

గ్లాస్ బ్రిడ్జ్ కాకుండా రాజ్‌గిర్ చుట్టూ రత్నగిరి, స్వర్ణగిరి, వైభర్ గిరి, విపుల్ గిరి, ఉదయగిరి అనే 5 అందమైన కొండలు ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రకృతికి దగ్గరగా ఉన్న అనుభవాన్ని పొందుతారు. అంతేకాదు ఇక్కడ వైల్డ్ లైఫ్ సఫారీని ఆస్వాదించవచ్చు. రాజ్‌గిర్ రోప్‌వే ద్వారా శాంతి స్థూపం (బౌద్ధ దేవాలయం)కి వెళ్ళవచ్చు . ఇలా రోప్ వే లో ప్రయాణించే సమయంలో అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..