మానవాళిపై మరో వైరస్ దాడి.. జపాన్‌లో వేగంగా STSS వ్యాధి వ్యాప్తి.. 48 గంటల్లో మరణం.. లక్షణాలు ఏమిటంటే

ఆసియా దేశమైన జపాన్‌లో ఓ ప్రాణాంతక వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా మానవ శరీరంలోకి ప్రవేశించి కణజాలాలపై దాడి చేస్తుంది.. వ్యాధిని గుర్తించి సకాలంలో చికిత్స అందకపోతే.. వ్యాధి సోకిన 48 గంటల్లోపే రోగి మరణిస్తాడు. ఈ వ్యాధి పేరు స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS). జపాన్‌లో 900 కంటే ఎక్కువ STAS కేసులు నమోదయ్యాయి. జపాన్‌తో పాటు, యూరప్‌లో కూడా ఈ వ్యాధి కేసులు నమోదయ్యాయి.

మానవాళిపై మరో వైరస్ దాడి.. జపాన్‌లో వేగంగా STSS వ్యాధి వ్యాప్తి.. 48 గంటల్లో మరణం.. లక్షణాలు ఏమిటంటే
Flesh Eating Bacteria In Japan
Follow us

|

Updated on: Jun 17, 2024 | 5:00 PM

మానవాళిపై వైరస్ లు ఓ రేంజ్ లో పగబట్టినట్లు ఉన్నాయి. ఏ సమయంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందో.. అప్పటి నుంచి ప్రపంచంలో ఏదోక చోట ఏదోక కొత్త వైరస్ కనిపిస్తూ.. లేదా పాత వైరస్ లు మళ్ళీ ప్రబలుతు మనుషులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఆసియా దేశమైన జపాన్‌లో ఓ ప్రాణాంతక వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా మానవ శరీరంలోకి ప్రవేశించి కణజాలాలపై దాడి చేస్తుంది.. వ్యాధిని గుర్తించి సకాలంలో చికిత్స అందకపోతే.. వ్యాధి సోకిన 48 గంటల్లోపే రోగి మరణిస్తాడు. ఈ వ్యాధి పేరు స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS). జపాన్‌లో 900 కంటే ఎక్కువ STAS కేసులు నమోదయ్యాయి. జపాన్‌తో పాటు, యూరప్‌లో కూడా ఈ వ్యాధి కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో STSS వ్యాధి అంటే ఏమిటి? ఇది ఎలా వ్యాపిస్తుంది మరియు రోగి 48 గంటల్లో ఎందుకు మరణిస్తాడు? ఈ వైరస్ గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం..

ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియాలలో ఒకటి స్ట్రెప్టోకోకస్, ఇది మానవులకు సోకుతుంది. ఈ బ్యాక్టీరియా జంతువు లేదా కీటకాల నుంచి వచ్చి మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ బ్యాక్టీరియా రక్తం, కణజాలాలలోకి ప్రవేశించి వాటి పనితీరును పాడు చేస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే.. రోగి 48 గంటల్లో మరణిస్తాడు.

ఈ వ్యాధి ఎలా వస్తుంది?

గాయం లేదా చిన్న కోత ద్వారా STAS బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుందని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో HOD డాక్టర్ జుగల్ కిషోర్ వివరిస్తున్నారు. ఈ బ్యాక్టీరియా శరీరంపై గాయాలు లేదా కాలిన గాయాలు ఇలా ఏదైనా శరీరం పై భాగంలో ఉంటుంది. ఇదే పద్ధతిలో ధనుర్వాతం కలిగించే బ్యాక్టీరియా కూడా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అయితే STSSతో బాధపడుతున్న వారిలో సగం మంది బాధితుల శరీరంలోకి బ్యాక్టీరియా ఎలా ప్రవేశించిందో నిపుణులకు తెలియడం లేదు. అయితే ఈ బ్యాక్టిరియా ఒకరి నుంచి మరొకరి వ్యాపించడానికి ఖచ్చితంగా గాయాలు ఒక మార్గం అని.. ఇలా బాధితులుగా మారిన రోగులు ఉదాహరణలు నిలుస్తున్నారని చెప్పారు. ఈ బాధితుల్లో లక్షణాలు ఏమిటంటే.. గాయం వేగంగా అభివృద్ధి చెందుతుంది. శరీర భాగాలలో వాపు, హై ఫీవర్, దద్దుర్లు , చర్మం పొట్టుగా రాలడం, బీపీ డౌన్.

ఇవి కూడా చదవండి

అయితే స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనేది కొత్త వ్యాధి కాదు. జపాన్‌లో గతంలో కూడా ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. STAS అనేది బాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి కనుక దీనిని పూర్తిగా నివారించలేమని నిపుణులు చెబుతున్నారు.

48 గంటల్లో మరణం ఎలా సంభవిస్తుందంటే

ఈ బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగి విపరీతమైన జ్వరంతో పాటు లో బీపీతో బాధపడతారని ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ ఆసుపత్రి నివాసి డాక్టర్ అంకిత్ రావత్ చెప్పారు. కణజాలం చనిపోవడం ప్రారంభించే విధంగా బ్యాక్టీరియా దాడి చేస్తుంది. దీని కారణంగా రోగి శరీరంలోని ఏదైనా భాగం విఫలమవుతుంది. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి కణజాలంపై దాడి చేయడానికి కొన్ని గంటలు మాత్రమే పడుతుంది. ఈ సమయంలో చికిత్స పొందకపోతే, అవయవం విఫలమవుతుంది. మరణానికి దారితీస్తుంది. ఈ బ్యాక్టీరియా గుండె, కిడ్నీ, కాలేయం వంటి ఏదైనా అవయవం మీద దాడి చేస్తుంది. ఈ వైరస్ కణజాలాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తుంది. కనుక దీనిని మాంసం తినే బ్యాక్టీరియా అంటారు.

ఈ వైరస్ ఎవరికీ ఎక్కువ ప్రమాదం అంటే?

ఇతర వ్యాధుల మాదిరిగానే పిల్లలు, వృద్ధులలో STSS ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి చాలా సందర్భాలలో 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి సోకుతుంది. శరీరంపై గాయాలతో ఉన్న వ్యక్తులలో STSS ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న వారు లేదా వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి ఈ వైరస్ సోకే అవకాశం ఉంది.

ఈ వ్యాధి లక్షణాలు ఏమిటంటే

  1. గొంతు మంట
  2. శరీరంలోని ఏదైనా భాగంలో వాపు
  3. నోటిలో ఎరుపు, ఊదా మచ్చలు
  4. శోషరస కణుపుల వాపు

ఈ వ్యాధి బాధితులను ఎలా గుర్తించాలంటే

STSS నిర్ధారణకు నిర్దిష్ట పరీక్ష లేదు. వ్యాధి సోకిన ప్రాంతంలో రోగి ఈ మూడు లక్షణాలను కనిపిస్తే అప్పుడు డాక్టర్ రోగి బ్లడ్ శాంపిల్ ను తీసుకొని వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. లక్షణాల్లో ముఖ్యంగా లో బీపీని పరిగణలోకి తీసుకుని .. రోగికి ఒకటి కంటే ఎక్కువ అవయవాల్లో సమస్య ఉంటే పరీక్షిస్తారు.

ఎలా రక్షించాలంటే

  1. గాయం చుట్టూ చికాకు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి
  2. తరచుగా చేతులు కడుక్కుంటూ ఉండాలి
  3. తీవ్ర జ్వరం ఉంటే వైద్యుడిని సంప్రదించాలి
  4. వ్యాధి బాధితులున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
కారు బీమా తీసుకుంటున్నారా.? ఆ ఒక్క జాగ్రత్తతో బోలెడన్ని లాభాలు
కారు బీమా తీసుకుంటున్నారా.? ఆ ఒక్క జాగ్రత్తతో బోలెడన్ని లాభాలు
ఆ ప్రాజెక్టు తెలంగాణకు ఓ వరంగా మారుతుంది.. డిప్యూటీ సీఎం భట్టి..
ఆ ప్రాజెక్టు తెలంగాణకు ఓ వరంగా మారుతుంది.. డిప్యూటీ సీఎం భట్టి..
అలర్ట్.. మూత్రవిసర్జన సమయంలో అలా జరుగుతుందా..? ఆలస్యం చేయకండి..
అలర్ట్.. మూత్రవిసర్జన సమయంలో అలా జరుగుతుందా..? ఆలస్యం చేయకండి..
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!