Elon Musk: ఎక్కువ ఇచ్చేశాం.. తిరిగి ఇచ్చేయండి.! వారికి ఎలన్ మస్క్‌ హెచ్చరిక..!

ఉద్యోగుల్ని తొలగించిన సమయంలో చెల్లించాల్సిన దానికంటే అధిక మొత్తం ఇచ్చామని ఓ సంస్థ పేర్కొంది. దానిని వారు వెంటనే తిరిగి ఇచ్చేయాలని సంస్థ సీఈవో మాజీ ఉద్యోగులకు మెయిల్‌ పంపించారు. ఆ వ్యక్తి ఎవరో కాదు.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్ . తన నిర్ణయాలు, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన ఎక్స్ మాజీ ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Elon Musk: ఎక్కువ ఇచ్చేశాం.. తిరిగి ఇచ్చేయండి.! వారికి ఎలన్ మస్క్‌ హెచ్చరిక..!

|

Updated on: Jun 17, 2024 | 11:55 AM

ఉద్యోగుల్ని తొలగించిన సమయంలో చెల్లించాల్సిన దానికంటే అధిక మొత్తం ఇచ్చామని ఓ సంస్థ పేర్కొంది. దానిని వారు వెంటనే తిరిగి ఇచ్చేయాలని సంస్థ సీఈవో మాజీ ఉద్యోగులకు మెయిల్‌ పంపించారు. ఆ వ్యక్తి ఎవరో కాదు.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్ . తన నిర్ణయాలు, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన ఎక్స్ మాజీ ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. 2022లో సోషల్ మీడియా సంస్థ ట్విటర్‌ను ఎలన్ మస్క్‌ కొనుగోలు చేశారు. ఈ తర్వాత దాని పేరును ఎక్స్‌గా మార్చారు. అలాగే దాదాపు 80 శాతం మంది సిబ్బందిని తొలగించారు. ఆ సమయంలో వారికి పరిహారం చెల్లించారు. అయితే ఆస్ట్రేలియాలోని కొందరు ఉద్యోగులకు చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ ముట్టిందని ఎక్స్ తెలిపింది. కరెన్సీ కన్వర్షన్, షేర్ల మదింపు సమయంలో జరిగిన పొరపాట్లు ఈ పరిస్థితికి దారితీశాయని తెలిపింది. ఆ సంస్థ ఆసియా ఫసిఫిక్ మానవవనరుల విభాగ అధికారుల్ని ఉటంకిస్తూ సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ ఒక కథనాన్ని ప్రచురించింది.

‘‘ మీరు వీలైనంత త్వరగా తిరిగి చెల్లింపులు చేస్తే సంతోషిస్తాం’’ అంటూ మాజీ ఉద్యోగులకు మెయిల్ పంపినట్లు తెలిపింది. వారు చెల్లించాల్సిన మొత్తం 1500 డాలర్ల నుంచి 70 వేల డాలర్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే ఆరుగురు మాజీలకు లీగల్ నోటీసులు అందినట్లు వెల్లడించింది. కొద్దినెలల క్రితం ఈ పరిహారం విషయంలో ఆ సంస్థ మాజీ ఉన్నతోద్యోగులు తీవ్ర ఆరోపణలు చేసారు. తమకు పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉందని కోర్టులో దావా వేశారు. తమ బకాయిలను ఎగ్గొట్టడానికి మస్క్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సంస్థతో ఉన్న ఒప్పందం ప్రకారం.. ఒక ఏడాది వేతనంతో పాటు తమకిచ్చిన స్టాక్‌ అవార్డులకు విలువ కట్టి ఇవ్వాల్సి ఉందని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us