వేగంగా వ్యాపిస్తున్న డేంజరస్ బ్యాక్టీరియా.. రెండంటే రెండే రోజుల్లో మనిషి ఖతం !!
రెండు రోజుల్లో మనిషిని చంపేసే డేంజరస్ బ్యాక్టీరియా జపాన్‌లో వేగంగా వ్యాపిస్తోంది. మనిషి మాంసాన్ని తినే ఈ ప్రాణాంతక బ్యాక్టీరియా జపాన్‌లోని టోక్యోలో వెలుగుచూసింది. స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ బ్యాక్టీరియా.. ఇది కరోనా కంటే డేంజర్. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా దెబ్బకు జపాన్ వణికిపోతోంది. మనిషి మాంసాన్ని తిని బతికే ఈ బ్యాక్టీరియా కేసులు జపాన్‌లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
రెండు రోజుల్లో మనిషిని చంపేసే డేంజరస్ బ్యాక్టీరియా జపాన్‌లో వేగంగా వ్యాపిస్తోంది. మనిషి మాంసాన్ని తినే ఈ ప్రాణాంతక బ్యాక్టీరియా జపాన్‌లోని టోక్యోలో వెలుగుచూసింది. స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ బ్యాక్టీరియా.. ఇది కరోనా కంటే డేంజర్. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా దెబ్బకు జపాన్ వణికిపోతోంది. మనిషి మాంసాన్ని తిని బతికే ఈ బ్యాక్టీరియా కేసులు జపాన్‌లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జపాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ ఫెక్షియస్ డీసీజెస్ ప్రకారం.. జూన్ 2 నాటికి 977 కేసులు నమోదు అయ్యాయి. అయితే.. ఈ బ్యాక్టీరియా కేసులు గతేడాది మొత్తం 941 నమోదు కాగా.. ఈ ఏడాది మాత్రం ఇప్పటికే 977 కేసులు దాటడం మరింత భయపెట్టే అంశం. ముఖ్యంగా.. ఈ ఏడాది ప్రథమార్థంలో టోక్యోలోనే 145 కేసులు నమోదు అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇక.. ఈ వ్యాధి లక్షణాలను పరిశీలిస్తే.. సాధారణంగా గొంతు నొప్పి, వాపు వంటి తేలికపాటి అనారోగ్య లక్షణాలతో మొదలవుతుంది. కానీ.. క్రమంగా శరీరంలోని అవయవాల నొప్పి, వాపు, జ్వరం, లో బీపీ, శరీర కణజాలాన్ని చంపేసే నెక్రోసిస్ వంటి తీవ్రమైన లక్షాణాలను కలిగి ఉంటుంది. వ్యాధి విజృభించి.. చివరికి అవయవాలు పూర్తిగా దెబ్బతిని మరణానికి దారితీవయచ్చు. ఈ వ్యాధి కేసులు.. 30 ఏళ్లు పైబడినవారిలో అత్యధికంగా నమోదు అవుతుండగా.. 50 ఏళ్లు పైబడినవారికి ప్రమాదకరంగా మారుతోంది. ఈ బ్యాక్టీరియాతో చాలా మరణాలు 48 గంటల్లోనే జరుగుతున్నట్లు గుర్తించారు జపాన్ శాస్త్రవేత్తలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వెళ్లిన మహిళ.. మేళ తాళాలతో గ్రామస్థుల ఘన స్వాగతం
జగన్ కూల్చిన ప్రజా వేదికను ఏం చేస్తామంటే.. చంద్రబాబు క్లారిటీ !!
పెళ్లి శుభలేఖపై పవన్ కల్యాణ్ ఫోటో.. వైరల్‌గా మారిన మ్యారేజ్ ఇన్విటేషన్
ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసిన మహిళ.. తెరిచి చూడగా ఊహించని షాక్
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి చెంప చెళ్‌మనిపించిన మత్స్యకారుడు..