ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసిన మహిళ.. తెరిచి చూడగా ఊహించని షాక్

ఇటీవల ముంబై నగరానికి చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌ ఆర్డర్ తెప్పించుకున్న ఐస్‌క్రీమ్ కోన్‌లో మనిషి వేలిని గుర్తించిన షాకింగ్ ఘటనను మరువక ముందే ఇదే తరహాలో మరో నిర్ఘాంతపోయే ఘటన వెలుగుచూసింది. ఎంతో ఇష్టమైన, రుచికరమైన ఆహారాన్ని తినడానికి సిద్ధమై మూత తీసి చూశాక అందులో జెర్రి ఉంటే ఎలా ఉంటుంది?.. ఊహించడానికే చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. కానీ ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన మహిళకు నిజంగానే ఈ పరిస్థితి ఎదురైంది.

ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసిన మహిళ.. తెరిచి చూడగా ఊహించని షాక్

|

Updated on: Jun 17, 2024 | 5:05 PM

ఇటీవల ముంబై నగరానికి చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌ ఆర్డర్ తెప్పించుకున్న ఐస్‌క్రీమ్ కోన్‌లో మనిషి వేలిని గుర్తించిన షాకింగ్ ఘటనను మరువక ముందే ఇదే తరహాలో మరో నిర్ఘాంతపోయే ఘటన వెలుగుచూసింది. ఎంతో ఇష్టమైన, రుచికరమైన ఆహారాన్ని తినడానికి సిద్ధమై మూత తీసి చూశాక అందులో జెర్రి ఉంటే ఎలా ఉంటుంది?.. ఊహించడానికే చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. కానీ ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన మహిళకు నిజంగానే ఈ పరిస్థితి ఎదురైంది. నోయిడాకు చెందిన ఓ మహిళ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తెప్పించుకున్న ఐస్‌క్రీమ్ టబ్‌లో ఒక జెర్రి కనిపించింది. గడ్డకట్టి చనిపోయి ఉన్న జెర్రి మూతకు అతుక్కొని ఉంది. దీప అనే మహిళకు జూన్ 15న ఈ అనుభవం ఎదురైంది. తన పిల్లల కోసం ఆన్‌లైన్‌లో దీప ఐస్‌క్రీమ్‌ ఆర్డర్‌ చేసింది. ప్రముఖ ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌కు చెందిన ఐస్‌ క్రీమ్‌ తాను ఆర్డర్‌ చేసింది. ఐస్‌క్రీమ్‌ డెలివరీ వచ్చింది. ఇక పిల్లలకు ఐస్‌ క్రీం పెడదామని ఐస్‌క్రీం బాక్స్ తెరవగానే ఆమె షాకయింది. అందులో గడ్డకట్టి ఉన్న జెర్రి కనిపించింది. వెంటనే ఐస్‌క్రీమ్‌ ఆర్డర్‌ పెట్టిన సంస్థకు ఫిర్యాదు చేయగా వారు తిరిగి డబ్బులు చెల్లించారని, అయితే బ్రాండెడ్‌ ఐస్‌క్రీమ్‌ కంపెనీ మాత్రం దీనిపై స్పందించలేదని తెలిపింది. ఐస్‌క్రీమ్‌ లో జెర్రి ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది ఇప్పుడు వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి చెంప చెళ్‌మనిపించిన మత్స్యకారుడు..

600 కోట్ల డైరెక్టర్‌ అయినా.. తిరిగేది మాత్రం చిన్న కార్‌లోనే !!

జీవిత పయనంలో అందరూ కోల్పోయేది అదే.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి మాటల

ఈ హీరోది రియల్ సక్సెస్ అంటే.. ఎంతైనా గ్రేట్ !!

Follow us
Latest Articles
ఆ ప్రాజెక్టు తెలంగాణకు ఓ వరంగా మారుతుంది.. డిప్యూటీ సీఎం భట్టి..
ఆ ప్రాజెక్టు తెలంగాణకు ఓ వరంగా మారుతుంది.. డిప్యూటీ సీఎం భట్టి..
అలర్ట్.. మూత్రవిసర్జన సమయంలో అలా జరుగుతుందా..? ఆలస్యం చేయకండి..
అలర్ట్.. మూత్రవిసర్జన సమయంలో అలా జరుగుతుందా..? ఆలస్యం చేయకండి..
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!
నేతాజీ గురించి తెలుసుకోవాలని ఉందా.? ఇది మీ కోసమే..
నేతాజీ గురించి తెలుసుకోవాలని ఉందా.? ఇది మీ కోసమే..