పెళ్లి శుభలేఖపై పవన్ కల్యాణ్‌ ఫోటో.. వైరల్‌గా మారిన మ్యారేజ్ ఇన్విటేషన్

పెళ్లి శుభలేఖపై పవన్ కల్యాణ్‌ ఫోటో.. వైరల్‌గా మారిన మ్యారేజ్ ఇన్విటేషన్

Phani CH

|

Updated on: Jun 17, 2024 | 6:22 PM

రాజకీయ నాయకుల మీదగానీ, సినీ నటుల మీదగానీ అభిమానులు తమ అభిమానాన్ని రకరకాలుగా చాటుకుంటూ ఉంటారు. అన్నదానం, రక్తదానం, విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే ఇక్కడో పవన్‌ కల్యాణ్‌ అభిమాని మాత్రం తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ కుటుంబరావు..

రాజకీయ నాయకుల మీదగానీ, సినీ నటుల మీదగానీ అభిమానులు తమ అభిమానాన్ని రకరకాలుగా చాటుకుంటూ ఉంటారు. అన్నదానం, రక్తదానం, విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే ఇక్కడో పవన్‌ కల్యాణ్‌ అభిమాని మాత్రం తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ కుటుంబరావు.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. అయితే తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. జూన్‌ 18న కుటుంబరావు పెళ్లి ఉండగా తన పెళ్లి పత్రిక పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోటో, జనసేన పార్టీ గుర్తుని ముద్రించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ముదిగొండ మండల జనసేన పార్టీ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న కుటుంబరావు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పలుమార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసిన మహిళ.. తెరిచి చూడగా ఊహించని షాక్

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి చెంప చెళ్‌మనిపించిన మత్స్యకారుడు..

600 కోట్ల డైరెక్టర్‌ అయినా.. తిరిగేది మాత్రం చిన్న కార్‌లోనే !!

జీవిత పయనంలో అందరూ కోల్పోయేది అదే.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి మాటల

ఈ హీరోది రియల్ సక్సెస్ అంటే.. ఎంతైనా గ్రేట్ !!