AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఫుడ్ కూడా కత్తిలా జీవితాన్ని కట్ చేయగలదు తెలుసా.. విమానంలో ఓ ప్రయాణీకుడి అనుభవం వైరల్..

ఎయిర్ ఇండియా విమానంలో కూడా ఓ ప్రయాణీకుడికి తినే ఆహారంలో వింత అనుభవం ఎదురైంది. తాను విమానంలో భోజనం ఆర్డర్ పెట్టగా అందులో మెటల్ బ్లేడ్ కనిపించిందని ఎయిర్ ఇండియా ప్రయాణీకుడు పేర్కొన్నాడు. ఈ ఘటన బెంగళూరు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లే విమానంలో చోటు చేసుకుంది. మాథుర్స్ పాల్ అనే జర్నలిస్ట్ గత వారం ఎయిర్ ఇండియా AI 175 విమానంలో తనకు ఎదురైన అనుభవాన్ని భోజనం చేసే సమయంలో పడిన కష్టాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

Viral News: ఫుడ్ కూడా కత్తిలా జీవితాన్ని కట్ చేయగలదు తెలుసా.. విమానంలో ఓ ప్రయాణీకుడి అనుభవం వైరల్..
Food Can Cut Like A Knife
Surya Kala
|

Updated on: Jun 17, 2024 | 7:20 PM

Share

ఇప్పటి వరకూ హోటల్స్ లో , రెస్టారెంట్స్ లో లేదా ఆన్ లైన్ లో పెట్టిన ఆహార పదార్ధాలలో ఎలుకలు, గోర్లు, ఇనుప ముక్కలు కనిపిస్తున్నాయి అనే వార్తలు వింటున్నాం.. తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో కూడా ఓ ప్రయాణీకుడికి తినే ఆహారంలో వింత అనుభవం ఎదురైంది. తాను విమానంలో భోజనం ఆర్డర్ పెట్టగా అందులో మెటల్ బ్లేడ్ కనిపించిందని ఎయిర్ ఇండియా ప్రయాణీకుడు పేర్కొన్నాడు. ఈ ఘటన బెంగళూరు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లే విమానంలో చోటు చేసుకుంది. మాథుర్స్ పాల్ అనే జర్నలిస్ట్ గత వారం ఎయిర్ ఇండియా AI 175 విమానంలో తనకు ఎదురైన అనుభవాన్ని భోజనం చేసే సమయంలో పడిన కష్టాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లో మిస్టర్ పాల్ కాల్చిన చిలగడదుంప, అంజూర చాట్‌తో విమానంలో భోజనం చేస్తున్నానని చెప్పాడు. అయితే తినే ఆహారంలో మెటల్ బ్లేడ్ కనిపించి షాక్ ఇచ్చింది అని పేర్కొన్నాడు. అంతేకాదు ఈ పోస్ట్ కు కొంత కామెంట్ కు కూడా జత చేశాడు. ఎయిర్ ఇండియా ఆహరం కత్తిలా పని చేసి జీవితాన్ని కత్తిరించవచ్చు అని చెప్పాడు. తాను కాల్చిన చిలగడ దుంప, అంజూర చాట్‌ ను తింటూ.. కొన్ని సెకన్ల పాటు ఆహారాన్ని నమిలిన తర్వత తాను తినే ఆహారంలో ఏదో తేడా ఉంది అనే అనుభూతి కలిగింది. అప్పుడు నములుతున్న దానిని నోటి నుంచి తీసి చూడగా బ్లేడ్ లాగా కనిపించే మెటల్ ముక్క బయటపడింది. అయితే తనకు దేవుడి దయవలన ఎటువంటి హాని జరగలేదని పేర్కొన్నాడు. అయితే తినే ఆహారంలో బ్లేడ్ రావడానికి కారణం మాత్రం పూర్తిగా ఎయిర్ ఇండియా క్యాటరింగ్ సర్వీస్‌దే బాధ్యత అని పేర్కొన్నాడు. అంతేకాదు ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎటువంటి సహాయం చేయలేదని పేర్కొన్నాడు. ఆహారంతో ఉన్న మెటల్ బ్లేడ్‌ను చూపించే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

తాను తిన్న ఆహారం ఏ చిన్న పిల్లలకు వెళ్తే.. అప్పుడు పరిస్థితి ఏమిటి? అసలు పిల్లవాడికి ఇటువంటి ఆహారాన్ని అందిస్తే ఏమి జరుగుతుందో అని ఆలోచించి ఎయిర్ ఇండియా క్యాటరింగ్ సర్వీస్ లోపం.. తీవ్రమైన పరిణామాలను హైలైట్ చేశాడు. “పిల్లలకు అందించే ఆహారంలో మెటల్ ముక్క ఉండి ఉంటె అప్పుడు పరిస్తితి ఎలా ఉంటుంది? మొదటి చిత్రంలో నేను ఉమ్మి వేసిన లోహపు ముక్కను చూపుతుంది.. రెండవ చిత్రం తనకు అందించిన ఆహారాన్ని చూపిస్తుంది,” అన్నారాయన.

ఈ సంఘటన ఎయిర్ ఇండియా అధికారుల దృష్టికి చేరుకుంది.. ఘటనకు ప్రతిస్పందనగా ఎయిర్ ఇండియా ప్రయాణికుడైన పాల్ ని సంప్రదించి.. ఏదైనా ఎయిర్ ఇండియా విమానంలో ఒక సంవత్సరం వరకు చెల్లుబాటు అయ్యే వన్-వే బిజినెస్ క్లాస్ టిక్కెట్‌ను అందించింది. అయితే మిస్టర్ పాల్ ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం.. ఇలా ఎయిర్ ఇండియా ఇచ్చే సదుపాయం తనకు ఇచ్చే లంచంగా పాల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..