AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain-Eating Amoeba: “మెదడును తినే అమీబా” ఐదేళ్ల బాలికను మింగేసింది..

ఇది నయం చేయలేని వ్యాధిగా చెబుతున్నారు. ఈ వ్యాధిలో మెదడు కణాలు దెబ్బతినడం ప్రారంభిస్తాయి. నేగ్లేరియా ఫౌలెరీ అమీబాలో ఒక ప్రత్యేక రకం. దీనిని స్వేచ్ఛా జీవి అని కూడా అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా పెరుగుతుంది. సాధారణంగా సరస్సులు, నదులు, చెరువులు, నీరు, వేడి నీరు ఎక్కడైనా పెరుగుతాయి.

Brain-Eating Amoeba: “మెదడును తినే అమీబా” ఐదేళ్ల బాలికను మింగేసింది..
Brain Eating Amoeba
Jyothi Gadda
|

Updated on: Jun 17, 2024 | 8:14 PM

Share

కేరళలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి మే 1వ తేదీన 5 ఏళ్ల బాలిక చెరువులో స్నానానికి వెళ్లింది. మే 10న బాలికకు జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. బాలిక పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. కానీ, ఎలాంటి మెడిసిన్‌ ఆమె వ్యాధిపై ప్రభావం చూపలేదు. చివరకు ఆ చిన్నారి మృత్యువాతపడింది. దీనిపై పూర్తి పరిశీలిన జరిపిన వైద్యులు షాకింగ్‌ విషయాలను వెల్లడించారు. చనిపోయిన చిన్నారి చెరువులో స్నానం చేసినప్పుడు అందులో స్వేచ్ఛగా జీవించే అమీబా ఆమె ముక్కు ద్వారా మెదడులోకి ప్రవేశించింది. దాని కారణంగానే బాలిక మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అందిన సమాచారం ప్రకారం, కేరళలోని మలప్పురం జిల్లాలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే వింత వ్యాధి కనుగొనబడింది. నిజానికి, ఇది మెదడులోని ఇన్ఫెక్షన్‌కి సంబంధించిన తీవ్రమైన వ్యాధి. ఈ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కారణంగా 5 ఏళ్ల బాలిక మృతి చెందింది. మురికి నీటి వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. మెబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్‌తో బాధపడుతున్న ఐదేళ్ల బాలిక మరణించింది. మురికి నీటిలో కనిపించే స్వేచ్ఛా అమీబా వల్ల ఈ వ్యాధి వస్తుంది. మూన్నియూర్ పంచాయతీకి చెందిన బాలిక కోజికోడ్ మెడికల్ కాలేజీలోని మాతా శిశు ఆరోగ్య సంస్థలో సోమవారం రాత్రి మృతి చెందిందని అక్కడి వైద్యులు తెలిపారు. అక్కడ వారం రోజులకు పైగా చికిత్స పొందుతూ చిన్నారి మృతిచెందింది.

వైద్యుల ప్రకారం, నీటిలో కనిపించే స్వేచ్ఛా అమీబా మురికి నీటిలో ఉన్నప్పుడు దాంతో మనిషికి ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది ముక్కు ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వివరాల ప్రకారం.. మే 1న బాలిక గ్రామ సమీపంలోని చెరువులో స్నానానికి వెళ్లింది. ఆ తర్వాత జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించడం ప్రారంభించాయి. అదే చెరువులో బాలికతో పాటు స్నానం చేసిన ఇతర చిన్నారులపై కూడా నిఘా ఉంచారు. అయితే, వారిలో ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేని కారణంగా వారిని డిశ్చార్జ్ చేశారు. ఈ వ్యాధి మొదట 2023, 2017లో రాష్ట్రంలోని తీర ప్రాంతమైన అలప్పుజా జిల్లాలో నమోదైంది. ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు జ్వరం, తలనొప్పి, వాంతులు, మూర్చగా చెప్పారు.

ఇవి కూడా చదవండి

దీనిని నేగ్లేరి ఫౌలేరి అని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం?

వాస్తవానికి, వ్యావహారిక భాషలో నేగ్లేరియా ఫౌలెరీని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు. ఈ కేసుకు ముందు కూడా భారతదేశం, ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ అమీబా కారణంగా చాలా మంది మరణించారు. ఇందులో 97 శాతం ఆ వ్యక్తి మనుగడ సాగించే అవకాశం లేదు. ఇది నయం చేయలేని వ్యాధిగా చెబుతున్నారు. ఈ వ్యాధిలో మెదడు కణాలు దెబ్బతినడం ప్రారంభిస్తాయి. నేగ్లేరియా ఫౌలెరీ అమీబాలో ఒక ప్రత్యేక రకం. దీనిని స్వేచ్ఛా జీవి అని కూడా అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా పెరుగుతుంది. సాధారణంగా సరస్సులు, నదులు, చెరువులు, నీరు, వేడి నీరు ఎక్కడైనా పెరుగుతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్